December Wonders: కొంచెం ఆహ్లాదం.. ఇంకొంచెం ఆందోళన.. డిసెంబర్ నెలలో ఆకాశవీధిలో కనిపించనున్న నెవర్ బిఫోర్ సీన్స్..

December Wonders: కొంచెం ఆహ్లాదం.. ఇంకొంచెం ఆందోళన.. డిసెంబర్ నెలలో ఆకాశవీధిలో కనిపించనున్న నెవర్ బిఫోర్ సీన్స్..
4660 Nereus Astroid

విశ్వం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అందులోనూ ఆకాశం నుంచి కనిపించే అద్భుతాలు చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యమే.. ఎప్పుడన్నా ఒక అద్భుతం ఆకాశంలో కనిపిస్తుందంటే ఎంతో ఆసక్తి.

KVD Varma

|

Dec 04, 2021 | 8:55 PM

December Wonders: విశ్వం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అందులోనూ ఆకాశం నుంచి కనిపించే అద్భుతాలు చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యమే.. ఎప్పుడన్నా ఒక అద్భుతం ఆకాశంలో కనిపిస్తుందంటే ఎంతో ఆసక్తి. అటువంటిది రెండు అద్భుతాలు బ్యాక్ టు బ్యాక్ ఒకే నెలలో కనిపిస్తాయంటే ఆ అనుభూతి చెప్పలేనిది కదా. సరిగ్గా అలాంటి రెండు ఆకాశ అద్భుతాలకు ఈ నెల నెలవవ్వబోతోంది. వాటిలో ఒకటి మనకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతం అయితే రెండోది మాత్రం కొద్దిగా టెన్షన్ పెడుతోంది. మరి ఆ రెండు అబ్బురాలను గురించి అక్షరాల్లో తెలుసుకుందాం రండి!

ముందు ఆహ్లాదం గురించి చెప్పుకుందాం. 70 వేల ఏళ్లకు ఒకసారి కనిపించే అద్భుతం ఈ నెలలో సాక్షాత్కరించనుంది. అది లియోనార్డ్ తోకచుక్క. ఇది భూమివైపు దూసుకువస్తోంది. భూమి వైపుగా చాలా దగ్గరగా ఈ నెలలో వస్తుంది. దగ్గరగా అంటే ఎంత దగ్గరగానో తెలుసా? కేవలం 3.5 3.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఈ లియోనార్డ్ తోకచుక్క వెళ్లనుంది.

ఈ ఏడాది జనవరి 3న మౌంట్ లెమన్ అబ్జర్వేటరీ వద్ద తొలిసారిగా ఈ తోకచుక్కను ఖగోళశాస్త్రవేత్త గ్రెగరీ జె లియోనార్డ్ గుర్తించారు. ఈ అద్భుతం డిసెంబర్ 10-16 తేదీల మధ్య మనకు కనిపిస్తుంది. లాటిన్ అమెరికా దేశాల్లోని ప్రజలు నేరుగా కళ్లతో దీన్ని చూడవచ్చని చెబుతున్నారు. డిసెంబర్ 13న పూర్తి స్థాయిలో లియోనార్డ్ కన్పిస్తుందని వెల్లదించారు శాస్త్రవేత్తలు. ఇక ఇది దక్షిణార్థ గోళంలోని దేశాలకంటే ఉత్తరార్థ గోళంలోని దేశాల ప్రజలకు ముందుగా ఇది కన్పిస్తుందని వారంటున్నారు.

భూమికి అత్యంత దగ్గరగా దూసుకు వెళ్ళే ఈ లియోనార్డ్ వాళ్ళ భూగోళానికి ఎటువంటి నష్టమూ ఉండదని చెబుతున్నారు ఖగోళశాస్త్రవేత్తలు. అయితే, ఈ తోకచుక్క భూమిని ఢీకొనే అవకాశాలు సైతం ఉండొచ్చు కానీ, ప్రమాదం ఉండదని చెబుతున్నారు వారు.

తోకచుక్క అంటే..

అంతర్జాతీయ అస్ట్రోనామికల్ యూనియన్(ఏఐయూ) 2006లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టు పరిభ్రమించే మిగతా అబ్జెక్ట్స్ లను తోకచుక్క లేదా స్మాల్ సోలార్ సిస్టమ్ బాడీగా పేర్కొంటారు. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువు లంటారు. తోకచుక్క తలలో మిథేన్, అమ్మోనియా, నీరు గడ్డకట్టి ఉంటాయి. సూర్యుని సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని మంచు కరిగి వాయువులు విడిపోతాయి. ఈ వాయుకణాల మీద, ఉల్కాధూళి కణాలమీద సూర్యకాంతి పడి ప్రతిఫలించి తోకలాగా ప్రకాశిస్తుంది. వాయువులను సౌరవాయువులు వెనక్కి తోసివేస్తాయి. ఫలితంగా తోకచుక్క తల సూర్యునివైపు, తోక సూర్యునికి వ్యతిరేక దిశలో అంటే భూమివైపు ఉంటాయి.

2021 నవంబర్ వరకు సౌర కుటుంబంలో 4584 తోకచుక్కలను గుర్తించారు. సౌరకుంటుంబం అవతల దాదాపుగా ఒక ట్రిలియన్ తోకచుక్కలున్నట్లు ఒక అంచనా.

లియోనార్డ్ మిగతా తోకచుక్కలకు ఎలా విభిన్నం?

తోక చుక్కలను ఖగోళ శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థలో ఎక్కడున్నా, ఎప్పుడైనా చూడగలుగుతారు. కాని, సాధారణ ప్రజలు టెలీస్కోప్ లేకుండా ప్రకాశంగా వెలిగే తోకచుక్కలను చూసే వీలు అరుదుగా ఏర్పడుతుంటాయి. లియోనార్డో 70వేల ఏళ్ల అనంతరం భూమి సమీపానికి వస్తుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది

తోకచుక్క సెంటిమెంట్..

తోకచుక్క కన్పిస్తే భూగోళంలో ఉత్పాతం లేదా ఏదైనా అరిష్టం ఏర్పడుతుందని చాలాదేశాల్లో ఓ నమ్మకం. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఈ తోకచుక్క కనిపించింది. దీని ఫలితంగానే శ్రీకృష్ణుడు చేసిన సంధి ఫలించక నాటి యుద్ధంలో లక్షల మంది సైనికులు హతమైపోయారు. క్రీ.పూ 1193లో ధూమకేతువు రాక వలన ఈజిప్టు రాజు మరణం జరిగింది. అప్పట్లో ఈజిప్టు దేశం నాగరికతలో విరాజిల్లుతూండేది. ఇదే విధంగా ధూమకేతువు ఆగమనం వల్ల అరిస్టాటిల్, గ్రీకువీరుడు అలెగ్జాండర్, సీజర్ వంటి మహామహులు మరణించారని వాదన ఉంది.

గతంలో తోకచుక్కలు ఎప్పుడు కనిపించాయి?

గతంలో హేలీ తోక చుక్క 1910, 1986లో కన్పించింది. హేలీ తోకచుక్కను 1682లో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు ఎడ్మండ్ హేలీ. హేలీ మళ్లీ 2061లో మళ్లీ దర్శనమిస్తుందని ఆయన వెల్లడించారు. ఆకాశంలో తెల్లటి పాయలా మెరిసే ఈ తోక చుక్క అవశేషాలు సౌర వ్యవస్థలో తిరుగుతుంటాయి. ఏడాదిలో రెండుసార్లు తోకచుక్క అవశేషాలు కనిపిస్తాయి

ఇదండీ ఆకాశంలో ఆహ్లాదకర విషయం. ఇక కొద్దిగా ఆందోళన కలిగిస్తున్న రెండో అద్భుతం గురించి తెలుసుకుందాం.

గ్రహశకలంతో ముప్పు..

మరోవైపు డిసెంబర్ 11న భూమివైపుకు నెర్యూస్‌(4660) గ్రహశకలం దూసుకు వస్తోంది. ఇది 3 ఫుట్‌బాల్‌ స్టేడియంలు కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దదిగా ఉంటుంది. నాసా ఈ నెర్యూస్‌ భూమికి ప్రమాదకరమైన గ్రహశకలంగా ఇప్పటికే చెప్పింది.

గ్రహశకలంతో భూమికి డేంజర్‌ తప్పదా.?

4660 నెర్యూస్ గ్రహశకలం గతి తప్పి చలిస్తోంది. ఇది భూమి దిశగా వేగంగా దూసుకు వస్తున్నట్లు నాసా వెల్లడించింది. అమెరికన్ ఖగోళశాస్త్రవేత్త ఎలీనార్ ఎఫ్ హెలిన్ ఈ నెర్యూస్ గ్రహశాకలాన్ని 1982 ఫిబ్రవరి 28న నెర్యూస్ ను గుర్తించారు.

ఇది సాధారణమే..

గ్రహ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించడం సాధారణమే. అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే తీవ్రమైన ఒత్తిడికి లోనై మండిపోతుంటాయి. మరికొన్ని గ్రహ శకలాలు భూమి సమీపం నుంచి దూసుకెళుతుంటాయి. అరుదుగా కొన్ని గ్రహ శకలాలు భూమిని ఢీకొడుతుంటాయి. పెద్ద గ్రహ శకలాలు ఢీకొంటే భూగోళానికి విపత్తే అని పరిశోధకులు చెబుతారు. 5 కోట్ల సంవత్సరాల క్రింద గ్రహ శకలం ఢీకొని రాక్షస బల్లులు అంతరించి పోయాయంటున్న పరిశోధకులుపోయాయని వారు చెబుతున్నారు.

4660 నెర్యూస్ గ్రహ శకలం భూమిని ఢీ కొంటుందా?

2021, డిసెంబర్ 11 నాటికి భూమికి సమీపంగా వస్తుందని నాసా చెబుతోంది. నాసా ప్రకటించిన ప్రమాదకరమైన గ్రహశకలాల జాబితాలో నెర్యూస్ ఒకటి. నెర్యూస్ పొడవు 330 మీటర్ల పొడవు కాగా.. ఇది సెకన్ కు 6.58 కిలో మీటర్ల వేగంతో భూమివైపు దూసుకువస్తోంది. భూమికి 39 లక్షల కిలోమీటర్ల దూరంలోకి రానుంది  నెర్యూస్ గ్రహశకలం.

సాధారణ లెక్కలో ఇది అధికమే.. కాని అంతరిక్షం లెక్కల్లో ఈ దూరం చాలా తక్కువ. గతి తప్పి దూసుకొస్తున్న నెర్యూస్ ను ఇతర గ్రహ శకలం ఢీకొంటే అది భూమివైపు వచ్చే ప్రమాదం. ఈ నేపథ్యంలో నెర్యూస్ గమనాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్న నాసా

నాసా అంచనాలు..

1968 నుంచి వెయ్యికి పైగా గ్రహశకలాల్ని రాడార్ ద్వారా నాసా పరిశీలించింది. టెలిస్కోపుల ద్వారా భూమివైపు వచ్చే 27,323 గ్రహశకలాల్ని నాసా గుర్తించింది. వాటిలో 9,886 గ్రహశకలాలు 140 మీటర్ల (459 అడుగులు) కంటే పెద్దవి. రానున్న వందేళ్లలో వీటిలో చాలా గ్రహశకరాలు భూగోళాన్ని ఢీకొట్టే అవకాశాలున్నాయని నాసా చెబుతోంది.

ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ రెండు అద్భుతాలూ దాదాపు ఒకే సమయంలో మనకు కనిపిస్తాయి. అంటే ఈ నెl 10 నుంచి 16 వరకూ ఖగోళ అద్భుతాలను చూడడానికి మనం సిద్ధం అయిపోవలసిందే!

ఇవి కూడా చదవండి: IRCTC Tour Package: తక్కువ ఖర్చుతో గుజరాత్ లోని పసిద్ధ ప్రాంతాలు చుట్టి వచ్చేసే సూపర్ ఛాన్స్.. వివరాలివే!

Non-Fungible Tokens: ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి సోదర స్వరకర్తలు సలీం సులైమాన్.. ఈ నాన్-ఫంజిబుల్ టోకెన్‌లంటే ఏమిటో తెలుసా?

IRCTC Tour Package: తక్కువ ఖర్చుతో గుజరాత్ లోని పసిద్ధ ప్రాంతాలు చుట్టి వచ్చేసే సూపర్ ఛాన్స్.. వివరాలివే!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu