షావోమి స్మార్ట్‌ టీవీ.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు..

షావోమి స్మార్ట్‌ టీవీ.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు..

స్మార్ట్‌ ఫోన్‌ ఉత్పత్తుల్లో సరికొత్త ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటున్న షావోమి సరికొత్త టీవీతో మార్కెట్లోకి వచ్చింది. “రెడ్‌మీ టీవీ-70 ఇంచ్‌’ పేరుతో తొలి స్మార్ట్‌ టీవీని విడుదల చేసింది. దీని ధర 3,799 చైనీస్‌ యువాన్లు, భారత కరెన్సీలో రూ. 38 వేలుగా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 3 నుంచి చైనాలో స్మార్ట్‌ టీవీ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. కాగా భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్నిషావోమి ప్రకటించలేదు. కానీ, త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకావం ఉందని […]

Pardhasaradhi Peri

|

Aug 30, 2019 | 3:14 PM

స్మార్ట్‌ ఫోన్‌ ఉత్పత్తుల్లో సరికొత్త ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటున్న షావోమి సరికొత్త టీవీతో మార్కెట్లోకి వచ్చింది. “రెడ్‌మీ టీవీ-70 ఇంచ్‌’ పేరుతో తొలి స్మార్ట్‌ టీవీని విడుదల చేసింది. దీని ధర 3,799 చైనీస్‌ యువాన్లు, భారత కరెన్సీలో రూ. 38 వేలుగా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 3 నుంచి చైనాలో స్మార్ట్‌ టీవీ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. కాగా భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్నిషావోమి ప్రకటించలేదు. కానీ, త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకావం ఉందని మాత్రం మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే “ఎంఐ’ బ్రాండ్‌తో స్మార్ట్‌ టీవీలను విడుదల చేసిన షావోమి..ఇప్పుడు సరికొత్తగా రెడ్‌మీ సిరీస్‌తో త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. రెడ్‌మీ టీవీ70- ఇంచ్‌ ఫీచర్లు 4కే రెజల్యూషన్ స్కీన్‌ హెచ్‌డీఆర్‌ సపోర్ట్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ 2జీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ డాల్బీ ఆడియా డీటీఎస్‌ హెచ్డీ ఆడియో టెక్నాలజీస్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu