Xiaomi Diwali Sale: రెడ్ మీ స్మార్ట్‌ఫోన్ల‌పై దివాలి ఆఫర్స్.. రూ. 5వేల వరకూ తగ్గింపు..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ షావోమీ అద్భుత డీల్స్ ప్రకటించింది. రెడ్ మీ స్మార్ట్ ఫోన్లపై దివాలి 2024 పేరిట భారీ తగ్గింపులను అందిస్తోంది. దీంతో రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్, రెడ్ నోట్ 13 ప్రో ధరలు భారీగా తగ్గాయి. ఈ ఆఫర్లు సెప్టెబర్ 21 నుంచి అదికారిక ఎంఐ వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ పారంలు, షావోమీ రీటైల్ పార్ట్ నర్స్ వద్ద అందుబాటులో ఉంటుంది.

Xiaomi Diwali Sale: రెడ్ మీ స్మార్ట్‌ఫోన్ల‌పై దివాలి ఆఫర్స్.. రూ. 5వేల వరకూ తగ్గింపు..
Redmi Note 13 Pro 5g
Follow us

|

Updated on: Sep 23, 2024 | 4:56 PM

దసరా, దీపావళి పండుగల సీజన్ ప్రారంభమైంది. మార్కెట్లో అన్ని కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించేస్తున్నాయి. అటు ఆన్ లైన్ వేదికలతో పాటు ఆఫ్ లైన్ స్టోర్లు కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ షావోమీ అద్భుత డీల్స్ ప్రకటించింది. రెడ్ మీ స్మార్ట్ ఫోన్లపై దివాలి 2024 పేరిట భారీ తగ్గింపులను అందిస్తోంది. దీంతో రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్, రెడ్ నోట్ 13 ప్రో ధరలు భారీగా తగ్గాయి. ఈ ఆఫర్లు సెప్టెబర్ 21 నుంచి అదికారిక ఎంఐ వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ పారంలు, షావోమీ రీటైల్ పార్ట్ నర్స్ వద్ద అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ధరల తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లను కూడా రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్ మీ నోట్ 1 ప్రో ప్లస్ ఫోన్లపై పొందొచ్చు. ఇప్పుడు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ ధర, ఆఫర్లు..

రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ లాంచ్ చేసినప్పుడు దర రూ. 24,999గా ఉంది. ఇప్పుడు షావోమీ ప్రకటించిన ఈ దివాలి సేల్ 2024లో దీనిని కేవలం రూ. 20,000లకే కొనుగోలు చేయొచ్చు. రెడ్ మీ నోట్ 13 ప్రో బేస్ వేరియంట్ ధర రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 200ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 5,100ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ ధర, ఆఫర్లు..

రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ మన దేశంలో లాంచ్ అయినప్పుడు దాని ధర రూ. 30,999గా ఉంది. షావోమీ ప్రకటించిన దివాలి సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 24,999కే కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యూనిక్ వేగన్ లెదర్ డిజైన్ తో వస్తుంది. కర్డ్వ్ అమోల్డ్ ప్యానల్ ఉంటుంది. దీనిలో కూడా 200ఎంపీ ప్రైమరీ షూటర్ ఉంటుంది. ఐపీ68 సర్టిఫికేషన్, 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్ సెట్ తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

ధరల వివరాలు ఇవి..

రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ..

  • 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 24,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 19,999కి లభిస్తోంది.
  • 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 26,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 21,999కి లభిస్తోంది.
  • 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 28,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 22,999కి లభిస్తోంది.

రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ..

  • 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 30,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 24,999కి లభిస్తోంది.
  • 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 32,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 26,999కి లభిస్తోంది.
  • 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 34,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 28,999కి లభిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..