ప్రమాదంలో గాయపడ్డ తండ్రి.. ఇంటికి వచ్చిన తనయుడు.. తండ్రికోసం ఏం చేశాడో తెలిస్తే శభాష్ అంటారు..!

భారతదేశంలో ప్రతిభకు కొదవ లేదు. వెలికి తీయాలే గానీ.. మట్టిలోని మాణిక్యాలు ఎంతోమంది వెలుగులోకి వస్తారు. టెక్నాలజీ ఆవిష్కరణలు..

ప్రమాదంలో గాయపడ్డ తండ్రి.. ఇంటికి వచ్చిన తనయుడు.. తండ్రికోసం ఏం చేశాడో తెలిస్తే శభాష్ అంటారు..!
Follow us

|

Updated on: May 13, 2021 | 8:24 PM

భారతదేశంలో ప్రతిభకు కొదవ లేదు. వెలికి తీయాలే గానీ.. మట్టిలోని మాణిక్యాలు ఎంతోమంది వెలుగులోకి వస్తారు. టెక్నాలజీ ఆవిష్కరణలు పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ ఆవిష్కృతం అవుతున్నాయి. పల్లెల్లోనూ వినూత్న ప్రయోగాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు తన తండ్రి కోసం డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను రూపొందించాడు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు సరికొత్త ఆవిష్కరణ చేశాడు.

వివరాల్లోకెళితే.. రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలకు చెందిన యోగేశ్ తండ్రి ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. యోగేష్ డిగ్రీ బీఎస్సీ చదువుతున్నాడు. అయితే, యోగేష్ తండ్రి ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతను ట్రాక్టర్ నడపలేకపోయాడు. ఈ క్రమంలో యోగేష్ తానే స్వయంగా కొంతకాలం ట్రాక్టర్ నడిపాడు. ఈ అయితే, యోగేశ్ కి మదిలో వినూత్న ఆలోచన తట్టింది. ట్రాక్టర్‌ని రిమోట్ నియంత్రిస్తే ఎలా ఉంటుందని భావించాడు. ఆ దిశగా ప్రయోగాలు చేశాడు. తొలుత బొమ్మ ట్రాక్టర్‌తో ప్రయోగాలు చేశాడు. తన ప్రయోగాన్ని తన తండ్రికి చూపించాడు. యోగేశ్ ఆవిష్కరించిన అతని తండ్రి అతన్ని ప్రోత్సహిస్తూ కొంత డబ్బును ఇచ్చాడు. ఆ తరువాత రిమోట్ ద్వారా ట్రాక్టర్ నడపేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉండటంతో.. యోగేశ్ తండ్రి తన బంధువులు, స్నేహితుల వద్ద డబ్బు అప్పు తీసుకువచ్చాడు. కొడుక్కి ఇచ్చాడు.

ఆ డబ్బుతో యోగేశ్ రిమోట్ ఆధారంగా ట్రాక్టర్ నడిచేలా ఆవిష్కరణ చేశాడు. స్టీరింగ్, గేర్, బ్రేక్స్, క్లచ్ అన్నింటినీ కంట్రోల్ చేసేలా పరికరం రూపొందించాడు. ఈ రిమోట్‌తో ట్రాక్టర్‌ను ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుంచి నియంత్రించవచ్చునని యోగేశ్ తెలిపాడు. ట్రాక్టర్‌ని రిమోట్ ఆధారంగా నడిపి చూపించాడు కూడా. ఈ ఆవిష్కరణతో పొలాల్లో ట్రాక్టర్ నడపటానికి ఇకపై డ్రైవర్ ఏమాత్రం అవసరం లేదు. ఈ ప్రమోగం వల్ల డబ్బు ఆదా చేయడమే కాకుండా వ్యవసాయ పనులకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ ఆవిష్కరణ నేపథ్యంలో.. తన లక్ష్యాన్ని వెల్లడించాడు యోగేశ్. ట్రాక్టర్‌లో ట్రాన్స్‌మిటర్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. ఇది రిమోట్ కంట్రోల్, ట్రాక్టర్ మధ్య కనెక్టర్‌గా పని చేస్తుంది. ఇది నిజంగా రైతులకు వరం అనే చెప్పాలి. డ్రైవర్ లేని ట్రాక్టర్‌ను ఉపయోగించడం ద్వారా.. డ్రైవర్ కోసం చేసే ఖర్చు వారికి మిగిలినట్లు అవుతుంది. ఇదిలాఉంటే.. డ్రైవర్ లేని ట్రాక్టర్‌ను రూపొందించిన యోగేశ్.. ఇప్పుడు తన లక్ష్యం ఆర్మీ కోసం పని చేయడమే అని చెప్పారు. భారత సైన్యం కోసం డ్రైవర్ లెస్ వార్ ట్యాంక్ నిర్మించాలనుకుంటున్నానని తన మనోగతాన్ని చెప్పాడు. మేక్ ఇన్ ఇండియా కింద తన ప్రాజెక్టు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

Also read:

South Indian actress: సౌత్‌ బ్యూటీస్‌ డేట్స్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ క్యూ.. మ‌న ముద్దుగుమ్మ‌ల‌కు అక్క‌డ భ‌లే డిమాండ్

Covaxin : కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీకి కేంద్రం నిర్ణయం, టీకా ఫార్ములా మరికొన్ని కంపెనీలకు.. వేగవంతం కానున్న ఉత్పత్తి

Rakul Preet Singh: కోవిడ్ బాధితుల కోసం నేను సైతం అంటోన్న ర‌కుల్ ప్రీత్… మీకు తోచినంత సాయం చేయండంటూ..