ఫోన్‌ కొనాలనుకుంటున్నారా..? ఈ నెల 13న ఇండియన్‌ మార్కెట్‌లోకి ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది! ఓ లుక్కేయండి..

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 13న ఇండియాలో లాంచ్ అవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, గూగుల్ జెమిని AI, 16GB RAM, 512GB స్టోరేజ్ ఉన్నాయి. 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,300mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఫోన్‌ కొనాలనుకుంటున్నారా..? ఈ నెల 13న ఇండియన్‌ మార్కెట్‌లోకి ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది! ఓ లుక్కేయండి..
Oneplus 15

Updated on: Nov 01, 2025 | 10:59 PM

OnePlus తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15ని నవంబర్ 13న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుందని, Google Gemini ఇంటిగ్రేషన్‌తో వస్తుందని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని, Android 16 ఆధారంగా ఆక్సిజన్ OS 16పై నడుస్తుందని భావిస్తున్నారు.

నివేదికల ప్రకారం OnePlus 15లో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. ఇది 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీతో రావచ్చు. అలాగే Vivo X300, Vivo X300 Pro గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్‌ అయ్యాయి. అవి కూడా త్వరలోనే ఇండియాలో కూడా విడుదల కానున్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి