
ఒకప్పుడు ఫోన్ అంటే మాట్లాడటానికి మాత్రమే. తరువాత అన్ని రకాల ఫీచర్లు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. ఫోన్ అంటే ఎమోషన్‌గా మారిపోయింది. ముఖ్యంగా సెల్ఫీ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ యూసేజ్ పూర్తిగా మారింది. అందుకే ఫోన్ల తయారీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే.. కెమెరా క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో మోటోరోలా ఇండియాలో కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కంపెనీ టీజర్ వీడియోను షేర్ చేసింది. మోటో ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేసేసింది. ఈ డివైస్ మిడ్-రేంజ్, అప్పర్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీజర్‌లో కనిపించిన డిజైన్ ప్రకారం, ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్లాష్‌తో కొత్త మోడల్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్‌లో కెమెరా హైలైట్ కానుంది. కొత్తగా విడుదల చేస్తున్న ఈ మోడల్‌లో 50MP సోనీ LYTIA కెమెరా ఫిక్స్ చేసినట్టు రివీల్ చేసింది మోటోరోలా.
టీజర్ వీడియోలో మోటోరోలా “పవర్, బట్ నాట్ ది వే యూ నో ఇట్. డ్రాప్ యువర్ బెస్ట్ గెసెస్” అని క్యాప్షన్ ఇచ్చింది. MOTO G సిరీస్ లేదా NEO సిరీస్‌లోని కొత్త మోడల్ కావచ్చని అంచనా వేస్తున్నారు. సోనీ LYTIA సెన్సార్‌తో వచ్చే ఈ కెమెరా, లో-లైట్ కండిషన్స్‌లో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, కలర్ యాక్యురసీ, డైనమిక్ రేంజ్ అందిస్తుంది. ఇది మోటోరోలా మిడ్-రేంజ్ ఫోన్లలో మొదటిసారిగా వస్తుందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
అయితే, వీటిపై కంపెనీ అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే, టీజర్ హింట్స్ ప్రకారం, పవర్‌ఫుల్ ప్రాసెసర్, లార్జ్ బ్యాటరీ, 5G సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ డిసెంబర్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని సమాచారం. ఈ మోడల్ ధర రూ.15,000–25,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
మోటోరోలా ఇండియాలో మోటో ఎడ్జ్ : సిరీస్ ఫోన్లకు మంచి రెస్పాన్స్ అందుతోంది. ఈ కొత్త ఫోన్‌తో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో సామ్‌సంగ్, వివో, రెడ్మి వంటి బ్రాండ్స్‌కు గట్టి పోటీ ఇస్తుందని టాక్.
ఈ టీజర్ మోటోరోలా ఇండియా ఇన్‌స్టాగ్రామ్, X అకౌంట్‌లో అందుబాటులో ఉంది. ఈ మోడల్ గురించి పూర్తి వివరాలు కావాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. మిడ్ రేంజ్‌లో మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారు ఈ మోడల్ లాంచ్ కోసం ఎదురుచూడాల్సిందే.