చంద్రయాన్ 2: విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం రంగంలోకి  నాసా!

చంద్రుడి ఉపరితలంపైకి దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు నిలిచిపోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఓవైపు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రదేశంలోనే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ కాగా, ల్యాండర్ పక్కకు వంగినట్టు గుర్తించారు. తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం విక్రమ్‌తో సంబంధాలు పునరుద్దరణకు ప్రయత్నిస్తోంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని డీప్ స్పేస్ నెట్‌వర్క్ […]

చంద్రయాన్ 2: విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం రంగంలోకి  నాసా!
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2019 | 10:56 PM

చంద్రుడి ఉపరితలంపైకి దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు నిలిచిపోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఓవైపు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రదేశంలోనే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ కాగా, ల్యాండర్ పక్కకు వంగినట్టు గుర్తించారు. తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం విక్రమ్‌తో సంబంధాలు పునరుద్దరణకు ప్రయత్నిస్తోంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని డీప్ స్పేస్ నెట్‌వర్క్ గ్రౌండ్ స్టేషన్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా విక్రమ్‌తో సంకేతాలు పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇస్రో అంగీకారంతోనే డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డీఎస్ఎన్) ద్వారా తన వంతు ప్రయత్నం చేస్తోందని తెలిపింది. విక్రమ్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించాలనే ఇస్రో ఆశలు సజీవంగా ఉన్నా, రోజులు గడిచేకొద్దీ అవకాశాలు తగ్గిపోతున్నాయి. చంద్రుడిపై ఒక్క రోజు (అంటే మనకు 14 రోజులు) మనుగడ సాగించేలా దీనిని రూపొందించారు. ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోవడంతో పరిస్థితి కొంత సంక్లిష్టంగా మారింది. చంద్రుడి ఉపరితలంపై సూర్యకిరణాల సాయంతో విద్యుత్‌ను తయారుచేసుకునేలా సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేయగా, ఇవి సెప్టెంబరు 20 నుంచి 21 వరకు మాత్రమే పనిచేస్తాయి.

నాసాకు చెందిన స్కాట్ టిల్లే అనే ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. కాలిఫోర్నియాలోని డీఎస్ఎన్ స్టేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ల్యాండర్‌‌తో కమ్యూనికేషన్‌కు ప్రయత్నిస్తున్నట్టు నిర్ధరించారు. 2005లో నాసా ప్రయోగించిన స్పై శాటిలైట్ ఇమేజింగ్ భూ కేంద్రంతో సంకేతాలు నిలిచిపోగా దానిని గుర్తించడంలో శాస్త్రవేత్త టిల్లే విజయం సాధించారు. దీంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాసా చేస్తున్న ప్రయత్నాలపై ట్వీట్ చేశారు. చంద్రయాన్ 2కు చెందిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్దరించడానికి డిఎస్‌ఎన్‌ విభాగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, గత రెండు రోజుల నుంచి సిగ్నల్ పంపుతోందని పేర్కొన్నారు.

‘ల్యాండర్‌కు ఆర్ఎఫ్ ద్వారా సంకేతాలు పంపినప్పుడు చంద్రుడు రేడియో రిఫ్లెక్టర్‌గా పనిచేస్తుంది.. దీంతో 8,00,000 కిలోమీటర్ల భ్రమణం తర్వాత భూమిపై ఉన్న సిగ్నల్‌లో కొంత భాగాన్ని తిరిగి పంపుతుంది.. మిగతా డీఎస్ఎస్ కేంద్రాల ద్వారానే ఈ ప్రక్రియ సాగుతోందని తాను నమ్మకంగా ఉన్నట్టు’ టిల్లే తెలిపారు. నాసాకు చెందిన డీఎస్ఎస్ కేంద్రాలు దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో మూడు చోట్ల ఉన్నాయి. భూమికి 120 డిగ్రీల కోణంలో ఉన్న ఈ మూడు కేంద్రాల ద్వారా ఏ ఉపగ్రహానాన్నైనా అంతరిక్షంలో గుర్తించే సామర్థ్యం ఉంది. ప్రతి కేంద్రాలోనూ 26 మీటర్ల ఎత్తు 70 మీటర్ల వ్యాసం కలిగిన కనీసం నాలుగు అతిపెద్ద యాంటిన్నాలు ఉంటాయి. ఒకే సమయంలో అనేక వ్యోమనౌకలతో నిరంతరాయంగా కమ్యూనికేట్ చేయగలవు.

డీఎస్ఎన్ 24 బీమ్స్ 12 కిలో వాట్ల శక్తిమంతమైన సంకేతాలను పంపిస్తున్నామని స్కాట్ టిల్లే తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తాము పంపించిన సిగ్నళ్లు చంద్రుడిని చేరి.. మళ్లీ భూమికి అందుతున్నాయని, దీనితో ఓ సర్క్యూట్ పూర్తి అయినట్టు భావిస్తున్నామని అన్నారు. ఎర్త్-మూన్-ఎర్త్ సర్క్యుట్ లో 2103 మెగా హెర్ట్జ్ తో తాము పంపిన సంకేతాలు వెనక్కి వస్తున్నాయని చెప్పారు. నాసా పంపిస్తోన్న సంకేతాలు శక్తిమంతమైనవి కావడం వల్ల త్వరలోనే వాటిని విక్రమ్ ల్యాండర్ గ్రహించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

[svt-event date=”12/09/2019,6:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]