అంతరిక్షం నుంచి హిమాలయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశారా.. అరుదైన ఫొటోను షేర్ చేసిన నాసా.! ఫిదా అవుతున్న నెటిజన్లు.

నిత్యం మంచుతో కప్పబడి ఉండే హిమాలయాల అందం గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ పర్వతశ్రేణులను అంతరిక్షం నుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఓ అద్భుత ఫొటోనే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా షేర్ చేసింది.

అంతరిక్షం నుంచి హిమాలయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశారా.. అరుదైన ఫొటోను షేర్ చేసిన నాసా.! ఫిదా అవుతున్న నెటిజన్లు.
Follow us

|

Updated on: Dec 17, 2020 | 8:20 PM

nasa shares himalayas photo: నిత్యం మంచుతో కప్పబడి ఉండే హిమాలయాల అందం గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ పర్వతశ్రేణులను అంతరిక్షం నుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఓ అద్భుత ఫొటోనే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా షేర్ చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నాసా.. ‘అంతరిక్షం నుంచి చూస్తే.. దట్టమైన తెల్లని మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతశ్రేణులు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సిబ్బంది తీసింది’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by NASA (@nasa)

అంతేకాకుండా ఈ చిత్రంలో హిమాలయాలతో పాటు ప్రకాశవంతమైన కాంతులతో ​కూడిన న్యూఢిల్లీ నగరం, లాహోర్‌, పాకిస్తాన్‌ దర్శనమిస్తున్నాయని పేర్కొంది. ఫొటోలోని కుడివైపు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని సారవంతమైన వ్యవసాయ భూమి కనిపిస్తోందని నాసా తెలిపింది. నాసా విడుదల చేసిన ఈ ఫొటో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భూమిపై ఉన్న అద్భుతాల్లో ఇదొకటని కామెంట్లు పెడుతున్నారు.