ఇక‌పై క‌రోనా చికిత్సలో నాసా వెంటిలేటర్లు…

ఇక‌పై క‌రోనా చికిత్సలో నాసా వెంటిలేటర్లు...

కరోనా బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు సరికొత్త హైప్రెజర్ వెంటిలేటర్లను రూపొందించింది నాసా. వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసబుల్ లోకల్ – VITAL అని పిలిచే ఈ సరికొత్త పరికరాన్ని కాలిఫోర్నియాలోని నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. అంతరిక్షంలోనే కాకుండా భూ ప్రపంచంలో కూడా అందరికీ ఉపయోగపడాలనే లక్ష్యంతో నాసా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ సరికొత్త వెంటిలేటర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం కూడా పొందింది. ప్రాణాంతక కరోనా […]

Ram Naramaneni

| Edited By: Anil kumar poka

May 03, 2020 | 1:24 PM

కరోనా బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు సరికొత్త హైప్రెజర్ వెంటిలేటర్లను రూపొందించింది నాసా. వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసబుల్ లోకల్ – VITAL అని పిలిచే ఈ సరికొత్త పరికరాన్ని కాలిఫోర్నియాలోని నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. అంతరిక్షంలోనే కాకుండా భూ ప్రపంచంలో కూడా అందరికీ ఉపయోగపడాలనే లక్ష్యంతో నాసా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ సరికొత్త వెంటిలేటర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం కూడా పొందింది. ప్రాణాంతక కరోనా వైరస్ భారిన ఎంతో మంది బాధితులు శ్వాస కూడా తీసుకోలేని స్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కృత్రిమ శ్వాస అందించేందుకు వెంటలేటర్లు చాలా అవసరం. అమెరికాలో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా వేలు, లక్షల సంఖ్యలో వెంటిలేటర్ల కొరత ఏర్పడటంతో ఎంతో మంది చనిపోయారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సరికొత్త వెంటిలేటర్ రూపొందింది. దక్షిణ కాలిఫోర్నియాలోని నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు.

కేవలం 37 రోజుల్లో ఈ హైప్రెజర్ వెంటిలేటర్లను తయారు చేయడం విశేషం. అంతరిక్ష పరిశోధన, విమానాలకు సంబంధించిన పరికరాలను తయారు చేయడంలో మాత్రమే అనుభవం ఉన్నతమకు ఈ పరిశోధన చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని అక్కడి మెకాట్రోనిక్స్ ఇంజినీర్స్ చెబుతున్నారు. మానవాళిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారికి ఇప్పటి వరకూ మందులేదు.. ఇలాంటి సమయంలో నాసా శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సరికొత్త హైప్రెజర్ వెంటిలేటర్లను తయారు చేశారు. దీనికి వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసబుల్ లోకల్ – VITAL అని పేరు పెట్టారు. విటాల్ ఇప్పటికే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం కూడా పొందింది. ఒక మంచి ప్రయోజం కోసం తయారు చేసిన ఈ విటాల్ వెంటిలేటర్ పరికరానికి రాయల్టీ కూడా ఆశించకుండా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది నాసా.. ఈ పరికారాన్ని చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని నాసా అధికారులు చెబుతున్నారు. విటాల్ హైప్రెజర్ వెంటిలేటర్లను కరోనాకే కాకుండా ఇతర అత్యవసర వైద్య సేవల సందర్భంగా కూడా ఉపయోగించుకోచ్చని నాసా అధికారులు చెబుతున్నారు. మున్ముందు దీన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu