ఎంఎన్‌పీకి తాత్కాలిక బ్రేక్‌ ఇస్తూ.. గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్..!

మొబైల్ పోర్టబిలిటీ.. మన మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోకుండా మరో ఆపరేటర్‌కు మార్చుకునే సదుపాయం గలది. అయితే ఈ సర్వీసుకు కొద్ది రోజులు బ్రేకులు పడనున్నాయి. వచ్చేనెల నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (MNP) సేవలను నిలిపివేస్తున్నట్లు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) శనివారం ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 11 నుంచి ఎంఎన్‌పీలో కొత్త విధానం రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓల్ట్ ప్రాసెస్‌లో […]

ఎంఎన్‌పీకి తాత్కాలిక బ్రేక్‌ ఇస్తూ.. గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్..!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 10:25 AM

మొబైల్ పోర్టబిలిటీ.. మన మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోకుండా మరో ఆపరేటర్‌కు మార్చుకునే సదుపాయం గలది. అయితే ఈ సర్వీసుకు కొద్ది రోజులు బ్రేకులు పడనున్నాయి. వచ్చేనెల నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (MNP) సేవలను నిలిపివేస్తున్నట్లు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) శనివారం ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 11 నుంచి ఎంఎన్‌పీలో కొత్త విధానం రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓల్ట్ ప్రాసెస్‌లో ఆపరేటర్‌ ఛేంజ్‌కు కనీసం వారం రోజుల సమయం పట్టేది. అయితే తాజాగా రానున్న ప్రాసెస్‌లో ఇది కేవలం రెండు రోజులలోనే పూర్తికానుంది.