Electric Cars: మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. సూపర్ డిజైన్..అద్భుత ఫీచర్లు…

Srinu

Srinu |

Updated on: Jan 27, 2023 | 1:10 PM

మధ్యతరగతి వినియోగదారులు మాత్రం ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడుతున్నా వాటి ధరలను చూసి మాత్రం కొంచెం వెనకడుగు వేస్తున్నారు. అయితే ఫీచర్ల విషయంలో ఫ్యూయల్ వెర్సన్స్ కంటే మెరుగ్గా ఉన్నా ధర మాత్రం వాటికంటే ఎక్కువ ఉంటున్నాయి.

Electric Cars: మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. సూపర్ డిజైన్..అద్భుత ఫీచర్లు…
Electric Cars

ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా అంతా ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మధ్యతరగతి వినియోగదారులు మాత్రం ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడుతున్నా వాటి ధరలను చూసి మాత్రం కొంచెం వెనకడుగు వేస్తున్నారు. అయితే ఫీచర్ల విషయంలో ఫ్యూయల్ వెర్సన్స్ కంటే మెరుగ్గా ఉన్నా ధర మాత్రం వాటికంటే ఎక్కువ ఉంటున్నాయి. దీంతో కొనాలని ఉన్నా ఏం చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. అయితే ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ కొన్ని కంపెనీలు మధ్యతరగతి వారి బడ్జెట్ ను దృష్టిలో కొన్ని కార్లను రిలీజ్ చేశారు. అయితే సరైన అవగాహన లేకపోవడంతో కొందరికీ ఈ విషయం తెలియడం లేదు. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే కొన్ని ఎలక్ట్రిక్ కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

పీఎం ఈజ్

ఇది సిటీ-సెంట్రిక్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో చిన్న 48 డబ్ల్యూ బ్యాటరీని ఉపయోగించారు. ఇందులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ 13.6 PS పవర్ మరియు 50 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 120 కిమీ, 160 కిమీ మరియు 200 కిమీ వంటి మూడు రకాల రేంజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ కారు గరిష్ట వేగం గంటకు 70 కిలో మీటర్లు. ఈ ఈవీ బ్లూటూత్ సపోర్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డోర్ లాక్ / అన్‌లాక్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లను పొందుతుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.79 లక్షలుగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుంది. 

టాటా టియాగో ఈవీ

టాటా టియాగో 19.2కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 61 పీఎస్, 110 ఎన్ఎం అవుట్‌పుట్‌, 24 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 75 పీఎస్, 114 ఎన్ఎం అవుట్‌పుట్‌లను పొందుతుంది. ఇవి వరుసగా 250 కిలో మీటర్లు నుంచి 315 కిమీ పరిధిని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో 15ఏ సాకెట్ ఛార్జర్, 3.3కెడబ్ల్యూ ఏసీ ఛార్జర్, 7.2 కెడబ్ల్యూ ఏసీ ఛార్జర్, డీసీ ఫాస్ట్ ఛార్జర్ వంటి నాలుగు ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

టాటా టిగోర్ ఈవీ

ఈ కారులో నెక్సాన్ ఈవీ నుంచి జిప్ట్రాన్ ఈవీ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ కారులో 26 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిసి 75 పీఎస్ శక్తిని మరియు 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 315 కిలో మీటర్ల పరిధిని పొందుతుంది. కారు స్టాండర్డ్ ఏసీ ఛార్జర్‌తో పాటు 25కెడబ్ల్యూ డీసీ ఫాస్ట్-ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.49 లక్షలు. 

నెక్సాన్ ఈవీ ప్రైమ్

నెక్సాన్ ఈవీ ప్రైమ్ 30.2కెడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో జత చేసిన ఎలక్ట్రిక్ మోటారుతో 129 పీఎస్ శక్తిని, 245 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు అరాయ్ సర్టిఫైడ్ పరిధి 312 కిలోమీటర్లు. ఈ కారుకు 3.3కెడబ్ల్యూ ఏసీ ఛార్జర్, 50కెడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ మద్దతు ఉంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.14.99 లక్షలు.

టాటా నెక్సాన్ ఈవీ మాక్స్

టాటా నెక్సాన్ ఈవీ మాక్స్‌లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 143 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 40.5కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఏఆర్ఏఐ ధ్రువీకరించిన 437 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఇది 3.3 కెడబ్ల్యూ, 7.2 డబ్ల్యూ ఏసీ, 50 కెడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఎంపికను కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.18.34 లక్షలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu