నిరుద్యోగులకు ప్రముఖ సంస్థ గుడ్‌న్యూస్.. 75 మిలియన్‌ డాలర్‌లతో..!

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఆర్థిక మాంద్యం ఇలానే కొనసాగితే..

నిరుద్యోగులకు ప్రముఖ సంస్థ గుడ్‌న్యూస్.. 75 మిలియన్‌ డాలర్‌లతో..!
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 3:33 PM

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఆర్థిక మాంద్యం ఇలానే కొనసాగితే.. కోట్ల మంది ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం పలు సర్వేలు సైతం చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌, క్లౌడ్ స్పేస్‌లలో 1500కు పైగా ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం 75 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 5,23,000 చదరపు అడుగల విస్తీర్ణంలో జార్జియాలోని అట్లాంటాలో ఓ కొత్త ఆఫీసును రూపొందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది ఈ కార్యాలయం కొలువుదీరనుంది.

దీనిపై మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ టెర్రెల్ కాక్స్ మాట్లాడుతూ.. ”అట్లాంటాలో పెట్టుబడులు పెట్టడం వలన ఇతర ప్రాంతాలకు మా ఉనికి విస్తరించడానికి అవకాశం ఉంది. దీని వలన మా సంస్థకి ఆర్థికంగా, సాంకేతికంగా లాభం చేకూరనుంది” అని అన్నారు. కాగా కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ మూడవ త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను, ఆదాయాన్ని సాధించినట్లు సంస్థ తెలిపిన విషయం తెలిసిందే.

Read This Story Also: చాలా ప్రయత్నించాం కానీ.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్..!