Whatsapp: మరో కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్‌.. వినియోగ దారుల డేటా భద్రతే ప్రధాన లక్ష్యంగా..

Whatsapp: ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంతలా క్రేజ్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మేసేజింగ్ యాప్‌గా పేరు తెచ్చుకున్న వాట్సాప్‌ గత కొన్ని నెలల...

Whatsapp: మరో కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్‌.. వినియోగ దారుల డేటా భద్రతే ప్రధాన లక్ష్యంగా..
Whatsapp New Feature
Follow us

|

Updated on: Jul 20, 2021 | 5:42 AM

Whatsapp: ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంతలా క్రేజ్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మేసేజింగ్ యాప్‌గా పేరు తెచ్చుకున్న వాట్సాప్‌ గత కొన్ని నెలల క్రితం కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొస్తుందన్న వార్తల కారణంగా ప్రతికూలత ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వ్యతిరేకత ఎక్కువవడంతో వాట్సాప్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో అప్పటి నుంచి కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ కోల్పోయిన తన యూజర్లను మళ్లీ తిరిగి సంపాదించుకునే పనిలో పడింది వాట్సాప్‌. ఈ క్రమంలోనే యూజర్ల భద్రతే ప్రధాన లక్ష్యంగా తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడిందీ టెక్‌ దిగ్గజం.

ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీనివల్ల చాటింగ్‌ చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు తప్ప మరెవరు.. చివరికి వాట్సాప్‌ కూడా ఆ చాటింగ్‌ను చూడకుండా వ్యవస్థను రూపొందించారు. అయితే ఈ చాటింగ్‌కు సంబంధించిన డేటా క్లౌడ్ స్టోర్‌ అయిన తర్వాత మాత్రం డేటాకు ఎలాంటి రక్షణ ఉండదు. దీంతో క్లౌడ్‌లో ఉన్న డేటాకు కూడా రక్షణ కలిగించాలనే ఉద్దేశంతోనే వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల క్లౌడ్‌లో స్టోర్‌ అయ్యే చాటింగ్‌ బ్యాక్‌అప్‌లు వాటంతటవే ఎన్‌క్రిప్ట్ అవుతాయి. దీంతో యూజర్‌ డేటా మరింత భద్రంగా మారుతుందన్నమాట. అంతేకాకుండా ఈ డేటాకు 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్ కీతో రక్షణ కల్పిస్తున్నారు. ఒకవేళ యూజర్‌ 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్‌ పాస్‌కోడ్ మర్చిపోయినా డేటాను రికవరీ చేయడం కుదరదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్ విడుదల చేశారు. త్వరలోనే అందరికీ అందబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: Samsung Galaxy Video: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్‌..(వీడియో).

Pegasus: ఆరోపణలన్నీ నిరాధారం.. కట్టుకథలు.. కోర్టులో పరువు నష్టం దావా వేస్తాం.. ‘పెగాసస్ హెచ్చరిక’ !

Google Chrome: మీరు గూగుల్‌ క్రోమ్‌ ఉపయోగిస్తున్నారా..?అయితే తక్షణమే అప్‌డేట్‌ చేసుకోండి

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!