Mars Mission: నాసా ఖాతాలో మరో విజయం.. మార్స్‌పై విజయవంతంగా దిగిన మినీ హెలికాప్టర్.. 11వ తేదీన కీలక ప్రయత్నం..

Mars Mission: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో విజయం సాధించింది. నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ ఇన్‌జెన్యూయిటీ మార్స్‌పై దిగింది.

Mars Mission: నాసా ఖాతాలో మరో విజయం.. మార్స్‌పై విజయవంతంగా దిగిన మినీ హెలికాప్టర్.. 11వ తేదీన కీలక ప్రయత్నం..
Ingenuity Helicopter
Follow us

|

Updated on: Apr 05, 2021 | 9:24 PM

Mars Mission: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో విజయం సాధించింది. నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ ఇన్‌జెన్యూయిటీ మార్స్‌పై దిగింది. దాదాపు 47 కోట్ల కిలోమీటర్లు నాసా పర్సీవరెన్స్‌ రోవర్‌తో పాటు ప్రయాణించిన ఈ మినీ హెలికాప్టర్.. రోవర్‌ను వీడి మార్స్‌ ఉపరితలంపై అడుగు పెట్టింది. ఈ విషయాన్ని నాసాకు చెందిన జెట్ పర్‌పల్షన్ లేబొరేటరీ వెల్లడించగా.. హెలికాప్టర్ మార్స్‌పై దిగిన సందర్భంలో పర్సీవరెన్స్ ఫోటో తీసింది. ఆ ఫోటోను కూడా నాసా విడుదల చేసింది. మార్స్‌ అన్వేషణ కోసం నాసా ప్రయోగించిన పర్సీవరెన్స్ రోవర్ గత నెల ఫిబ్రవరి 18వ తేదీన మార్స్‌పై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ పర్సీవరెన్స్ రోవర్ కింది భాగంలో ఇన్‌జెన్యూయిటీ మినీ హెలికాప్టర్‌ను కూడా ఫిక్స్ చేశారు. కాగా, ఇంతకాలం ఈ మినీ హెలికాప్టర్.. పర్సీవరెన్స్ పవర్ సిస్టమ్‌ను ఉపయోగించుకుని మనుగడ సాగించింది. ఇక మీదట సొంత బ్యాటరీ సాయంతో నడవాల్సి ఉంటుంది.

ఈ మినీ హెలికాప్టర్‌ ఇప్పుడే అసలైన పరీక్ష ఎదుర్కోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారక గ్రహంపై రాత్రి వేళల్లో మైనస్ 90 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఈ మినీ హెలికాప్టర్ నిలబడుతుందా? లేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు. అయితే, ఈ మినీ హెలికాప్టర్‌లో ఉష్ణోగ్రత అందించే ఒక హీటర్‌ను అమర్చారు. అది దాదాపు 7 డిగ్రీల ఉష్ణోగ్రతను అందిస్తుందట.

ఇదిలాఉంటే..ఈ ఇంజెన్యూయిటీ మినీ హెలికాప్టర్ ఈనెల 11వ తేదీన ఎగిరే ప్రయత్నం చేయనుంది. ఈ ప్రయత్నం కూడా చాలా రిస్క్‌తో కూడిన పని అని చెబుతున్నారు సైటింస్ట్‌లు. భూమి సాంద్రతలో కేవలం ఒకశాతం మాత్రమే మార్స్ సాంద్రత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ ఎగనరడం అంత సులువు కాదు. అయితే, గురుత్వాకర్షణ విషయంలో మాత్రం హెలికాప్టర్ ఎగిరేందుకు సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. భూమి గురుత్వాకర్షణ శక్తిలో, మార్స్ గురుత్వాకర్షణ శక్తి కేవలం మూడో వంతు మాత్రమే కావడం.. ఈ హెలికాప్టర్ ఎగిరేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్ విజయవంతంగా ఎగిరినట్లయితే.. శాస్త్రవేత్తలు మరో ఘన విజయాన్ని సాధించినట్లే అవుతుంది. గాల్లో చక్కర్లు కొడుతూ మార్స్ ఉపరితలాన్ని ఫోటోలు తీయడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. మరి 11వ తేదీన చేపట్టబోయే తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Also read:

సుడిగాలి సుధీర్‏ను ఇరికించిన హైపర్ ఆది.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన నాని.. పాపం మళ్లీ బుక్కైన సుధీర్..

ఢిల్లీకి చేరిన గుర్తు గోల.. గ్లాస్‌ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ, జనసేన కూటమి.. CECకి కంప్లైంట్‌

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన