‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్’ వారికి జియో బంపరాఫర్..!

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది.

  • Tv9 Telugu
  • Publish Date - 8:48 pm, Fri, 15 May 20
'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్' వారికి జియో బంపరాఫర్..!

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో చాలా టెలికం కంపెనీలు ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాకేజీలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా రిలియన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.999 రీఛార్జీతో 84 రోజుల వ్యాలిడిటీ, డైలీ 3 జీబీ డేటా, ఇతర జియో ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్లకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజువారీ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందించనుంది. అంతేకాకుండా జియో యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ వారిని దృష్టిలో పెట్టుకొనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా జియో ఇప్పటికే రూ.599 రీఛార్జీతో రోజువారీ 2జీబీ డేటా, రూ.555 రీఛార్జీతో 1.5జీబీ డేటా ప్లాన్లను 84 రోజుల వ్యాలిటిడీతో వినియోగదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

Read This Story Also: కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్‌ ఎప్పుడంటే..!