Reliance AGM 2019: జియో బంపర్‌ ఆఫర్‌తో రిలీజైన రోజే.. ‘సినిమా’ ఇంట్లో చూడొచ్చు..!

చాలా మంది తమ అభిమాన హీరో లేక హీరోయిన్ సినిమా.. మొదటి రోజే.. ఫస్ట్ షోలో చూడాలనుకుంటూంటారు. కానీ.. టికెట్స్.. దొరకనో.. టైం దొరకకో.. చూడటానికి వీలు కాదు. అంతేకాదు.. ఇప్పటి రోజుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే కనీసం రూ.2 వేలు పెట్టాల్సిందే. కానీ.. జియో గిగాఫైబర్‌తో రిలీజైన రోజే సినిమా చూడొచ్చని అంటున్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. లేటెస్ట్ టెక్నాలజీతో.. ఇప్పుడు ఏదైనా సాధ్యమవుతోంది. అలాంటి టెక్నాలజీ జియో గిగాఫైబర్‌లో ఉందని.. ‘సినిమా’ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:44 pm, Mon, 12 August 19
Reliance AGM 2019: జియో బంపర్‌ ఆఫర్‌తో రిలీజైన రోజే.. 'సినిమా' ఇంట్లో చూడొచ్చు..!

చాలా మంది తమ అభిమాన హీరో లేక హీరోయిన్ సినిమా.. మొదటి రోజే.. ఫస్ట్ షోలో చూడాలనుకుంటూంటారు. కానీ.. టికెట్స్.. దొరకనో.. టైం దొరకకో.. చూడటానికి వీలు కాదు. అంతేకాదు.. ఇప్పటి రోజుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే కనీసం రూ.2 వేలు పెట్టాల్సిందే. కానీ.. జియో గిగాఫైబర్‌తో రిలీజైన రోజే సినిమా చూడొచ్చని అంటున్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. లేటెస్ట్ టెక్నాలజీతో.. ఇప్పుడు ఏదైనా సాధ్యమవుతోంది. అలాంటి టెక్నాలజీ జియో గిగాఫైబర్‌లో ఉందని.. ‘సినిమా’ రిలీజైన రోజే.. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని అంటున్నారు. ముంబైలో జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజైనా.. దాని టీవీలో చూడొచ్చని అంటున్నారు. అయితే.. అది కేవలం తమ ప్రీమియం కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాదిలో ఈ సేవలు ప్రారంభమౌవుతాయని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు.

ఇప్పటికే.. వినియోగదారులు.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో సినిమా రిలీజైన 40 రోజులకు తర్వాత సినిమాను వీటిల్లో చూస్తున్నారు. కానీ.. ‘జియో’ మాత్రం రిలీజైన రోజే సినిమా చూసే సౌకర్యం కల్పిస్తుంది. వాటికి ‘జియో’ ఓ సవాల్ విసురుతుందనే చెప్పవచ్చు. కాగా.. జియోను వాడుతున్న వినియోగదారులకు ఇప్పటికే అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది రిలయన్స్ సంస్థ.

Jio First Day First Show plan