Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరవాలంటే ఆ పని చేయాల్సిందే.. వారికి చెక్‌పెట్టేందుకే..

Instagram: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియాలో ఫ్లాట్ ఫామ్‌లలో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి. యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు...

Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరవాలంటే ఆ పని చేయాల్సిందే.. వారికి చెక్‌పెట్టేందుకే..
Instagram
Follow us

|

Updated on: Nov 18, 2021 | 6:42 AM

Instagram: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియాలో ఫ్లాట్ ఫామ్‌లలో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి. యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు ఈ రేంజ్‌లో ఫాలోయింగ్‌ పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. దీనిని ఫీచర్‌ అని చెప్పడం కంటే సెక్యూరిటీ అప్‌డేట్‌ అని చెప్పాలి. పెద్ద ఎత్తున ఫేక్‌ ఖాతాలు ఓపెన్‌ అవుతోన్న నేపథ్యంలో ఆ సమస్యకు చెక్‌పెట్టడానికే ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త పాలసీని తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌పై యూజర్లలో అవగాహన కల్పించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ గడిచిన ఏడాది నుంచే పరీక్షిస్తున్నట్లు సమాచారం.

ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకురానున్న కొత్త పాలసీతో ఇకపై కొత్తగా ఖాతా తెరిచే వారు.. తమ సెల్ఫీ వీడియోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా కన్సల్టెంట్‌ మాట్‌ నవారా  ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి బలమైన కారణమే ఉంది. ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ అకౌంట్‌లు ఎక్కువుతున్నాయి. ఒకే వ్యక్తి మల్టీపుల్‌ అకౌంట్‌లను ఓపెన్‌ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ గుర్తించింది. దీంతో వారికి చెక్‌ పెట్టడానికే ఈ ప్లాన్‌ చేసింది. దీంతో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువగా అకౌంట్‌లు ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌ వెంటనే గుర్తు పట్టేస్తుందన్నమాట.

Also Read: ఆ రాష్ట్ర రైతులకు పెద్ద ఊరట.. 4000 కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లు మాఫీ..!

Airtel-VI-Jio: డేటా స్పీడ్‌లో జియో మళ్లీ టాప్.. దూసుకొస్తున్న ఎయిర్‌టెల్, విఐ నెట్‌వర్క్స్.. పూర్తి వివరాలు మీకోసం..

AP Municipal Elections Results: కుప్పం సహా దుమ్మురేపిన ఫ్యాన్‌.. ప్రజలకు ధన్యవాదాలన్న సీఎం జగన్‌