Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై ఫాలోవర్లకు నేరుగా..

రోజురోజుకీ ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోంది ప్రముఖ సోషల్ మీడియా సైట్‌ ఇన్‌స్టాగ్రామ్‌. తక్కువ సమయంలో ఎక్కువ మంది యూజర్లను దక్కించుకున్న ఈ సోషల్ మీడియా దిగ్గజం యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యంగా..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై ఫాలోవర్లకు నేరుగా..
Instagram New Feature
Follow us

|

Updated on: Oct 03, 2022 | 9:33 AM

రోజురోజుకీ ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోంది ప్రముఖ సోషల్ మీడియా సైట్‌ ఇన్‌స్టాగ్రామ్‌. తక్కువ సమయంలో ఎక్కువ మంది యూజర్లను దక్కించుకున్న ఈ సోషల్ మీడియా దిగ్గజం యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యంగా యువతను అట్రాక్ట్ చేస్తూ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇప్పటికే రీల్స్‌ పేరుతో యూత్‌కి బాగా చేరువైంది ఇన్‌స్టాగ్రామ్‌. టిక్‌టాక్‌ బ్యాన్‌ తర్వాత చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ బాట పట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టా అందుబాటులోకి తీసుకొచ్చింది.

నోట్స్‌ పేరుతో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని నోట్స్‌ రూపంలో పోస్ట్‌ చేయొచ్చు. కేవలం 60 అక్షరాల లిమిట్‌లో విషయాన్ని చెప్పాలి. ఇలా నోట్స్‌ను క్రియేట్ చేయగానే నేరుగా తమ ఫాలోవర్లకు డైరెక్ట్‌ మేజ్‌ (డీఎం) రూపంలో కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ ట్విట్టర్‌ను పోలి ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు ఎలాగైతే 24 గంటల తర్వాత వాటంతటవే డిలీట్‌ అవుతాయో నోట్స్‌ కూడా అలాగే డిలీట్ అవుతాయి.

నోట్స్‌కు ఎవరైనా ప్రతి స్పందిస్తే అవతలి వ్యక్తికి కూడా డైరెక్ట్‌ మెసేజ్‌ సెక్షన్‌లోనే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా స్టోరీస్‌లో కొత్త అప్‌డేట్‌ తెచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇకపై 60 సెకన్ల నిడివి ఉండే వీడియోను కంటిన్యూగా చూసే అవకాశాన్ని కల్పిస్తూ అప్‌డేట్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..