చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో రెడీ..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమయ్యింది. జులై 9-16 తేదీల మధ్య చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో రెడీ అయ్యింది. చంద్రయాన్-2 సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ అవుతంది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో ఈ ప్రయోగం జరుగుతుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపడుతున్న రెండో అతిపెద్ద ప్రయోగం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీని బరువు 3,290 కేజీలు. చంద్రుడి కక్ష్యలోకి విక్రం అనే ల్యాండర్‌ను […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:22 am, Thu, 2 May 19
చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో రెడీ..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమయ్యింది. జులై 9-16 తేదీల మధ్య చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో రెడీ అయ్యింది. చంద్రయాన్-2 సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ అవుతంది.

ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో ఈ ప్రయోగం జరుగుతుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపడుతున్న రెండో అతిపెద్ద ప్రయోగం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీని బరువు 3,290 కేజీలు.

చంద్రుడి కక్ష్యలోకి విక్రం అనే ల్యాండర్‌ను ఆర్భిటర్ ప్రవేశపెడుతుంది. చంద్రుడి ఉపరితలంలోని పరిస్థితులపై రోవర్ చిత్రాలను భూమికి పంపిస్తుంది. GSLV MK-111 లాంచ్ వెహికల్ నుంచి దీనిని ప్రయోగిస్తున్నారు.