‘టిక్‌టాక్’ ఫీవర్.. 550 కోట్ల గంటలు అందులోనే!

అసలు ఈ టిక్ టాక్ యాప్ లేనిదే మొబైల్ ఫోన్ ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ‘టిక్‌టాక్’ ఫీవరే నెలకొంది. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టిక్‌టాక్‌లోనే ములిగిపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వీడియో చేస్తూ.. దానితోనే కాలం గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది సెలబ్రిటీలు అవుతుంటే.. మరికొందరు లైక్‌ల కోసం ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో.. ఒకానొక సమయంలో.. దీన్ని బ్లాక్‌ కూడా చేశారు. దీనిపై తమిళనాడు అసెంబ్లీలో కూడా పెద్ద దుమారమే […]

'టిక్‌టాక్' ఫీవర్.. 550 కోట్ల గంటలు అందులోనే!

అసలు ఈ టిక్ టాక్ యాప్ లేనిదే మొబైల్ ఫోన్ ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ‘టిక్‌టాక్’ ఫీవరే నెలకొంది. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టిక్‌టాక్‌లోనే ములిగిపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వీడియో చేస్తూ.. దానితోనే కాలం గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది సెలబ్రిటీలు అవుతుంటే.. మరికొందరు లైక్‌ల కోసం ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో.. ఒకానొక సమయంలో.. దీన్ని బ్లాక్‌ కూడా చేశారు. దీనిపై తమిళనాడు అసెంబ్లీలో కూడా పెద్ద దుమారమే నడిచింది.

కాగా.. 2019లో టిక్‌టాక్‌లో భారతీయులు 550 కోట్ల గంటల సమయం గడిపారట. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన ‘యాప్ అన్నీ డేటా’ అనే అనలిటిక్స్ సంస్థ తెలిపింది. టిక్ టాక్ ఉపయోగిస్తున్న యూజర్లు 2018లో కంటే 2019లో ఎక్కువ సమయం గడిపినట్లు స్పష్టం చేసింది. 2019 నాటికి యాప్‌లో యాక్టీవ్‌గా ఉపయోగించే వారి సంఖ్య 90 శాతం పెరిగిందట. కాగా.. అటు టిక్‌టాక్‌ను వినియోగిస్తున్న యాక్టివ్ యూజర్లలో.. చైనా తొలి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉందని.. ‘యాప్ అన్నీ డేటా’ అనే సంస్థ పేర్కొంది.

Click on your DTH Provider to Add TV9 Telugu