రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుండి వైఫై కట్!

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్తూ.. గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో అందిస్తున్న ఉచిత వైఫైను ఎత్తివేస్తున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సర్వీసులు ఇక నుంచి ఆగిపోనున్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే… ఇప్పుడు ఇంటర్నెట్ సేవల ధరలు చాలా చౌకగా మారిపోయాయి. అందులోనూ ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ పెరిగింది. వివిధ రకాల ధరల్లో సులభంగా […]

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుండి వైఫై కట్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 18, 2020 | 4:03 PM

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్తూ.. గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో అందిస్తున్న ఉచిత వైఫైను ఎత్తివేస్తున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సర్వీసులు ఇక నుంచి ఆగిపోనున్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే… ఇప్పుడు ఇంటర్నెట్ సేవల ధరలు చాలా చౌకగా మారిపోయాయి. అందులోనూ ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ పెరిగింది. వివిధ రకాల ధరల్లో సులభంగా ఇంటర్నెట్ సేవలు లభ్యమవుతున్నాయి. చాలా ఫాస్ట్‌గా నెట్ వర్క్ అందుతోంది. కనుకనే దేశవ్యాప్తంగా వున్న అన్ని రైల్వే స్టేషన్‌లలో ఇంటర్నెట్ సేవలను ఆపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా.. 2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ప్రారంభించించగా.. ఇప్పటికి ఇది 5 సంవత్సరాలను పూర్తి చేసుకుందన్నారు. 2020 నాటికి 400కు పైగా అన్ని రైల్వే స్టేషన్‌లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్లు సీజర్ గుప్తా వెల్లడించారు.