గూగుల్ డ్యుయోలో గ్రూప్ వీడియో కాలింగ్.. ఒకేసారి 12 మందితో!

సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. గూగుల్ డ్యుయోలో ఎక్కువ మంది వినియోగదారులు చేరుతున్న నేపథ్యంలో గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. ప్రతీ వారం కోటి మందికి పైగా గూగుల్ డ్యూయోలో భాగమవుతున్నారు. అందులోనూ ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా..

గూగుల్ డ్యుయోలో గ్రూప్ వీడియో కాలింగ్.. ఒకేసారి 12 మందితో!
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 3:08 PM

సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. గూగుల్ డ్యుయోలో ఎక్కువ మంది వినియోగదారులు చేరుతున్న నేపథ్యంలో గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. ప్రతీ వారం కోటి మందికి పైగా గూగుల్ డ్యూయోలో భాగమవుతున్నారు. అందులోనూ ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య వీడియో కాలింగ్‌లకు గిరాకీ బాగా పెరిగిందట. ఈ నేపథ్యంలో టెక్‌ దిగ్గజం గూగుల్.. డ్యూయోలో ఒకేసారి 12 మందితో సంభాషించే సౌకర్యాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

గూగుల్ అకౌంట్ ఉన్న వారికి ఓ లింక్ ఆధారంగా ఈ గ్రూప్ వీడియో కాల్‌కు ఆహ్వానించవచ్చని పేర్కొంది. ఈ వారంలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో దీనిని వినియోగించవచ్చని స్పష్టం చేసింది. అలాగే వీడియో కాలింగ్ సమయంలో ఎదుటి వారిని ఆశ్చర్యపరిచేందుకు మాస్కులు, కళ్లద్దాలు వంటి వినోదాత్మక ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయని వివరించింది గూగుల్. ఇతరులతో కాల్ మాట్లాడుతుండగా ఫొటో కూడా తీసుకునే అవకాశం కల్పించింది గూగుల్ డ్యుయో. అలాగే వీడియో కాలింగ్ సమయంలో అనుకోకుండా మాటలు వినిపించకపోవడం, కాల్ కట్ అయిపోవడం వంటి అవాంతరాలు లేకుండా మ్యూట్, హ్యాంగ్ అప్ అనే ఆప్షన్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పింది గూగుల్.

Read More: దిల్‌రాజు పెళ్లి ఫొటోలు.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!