Online shopping: ఆఫర్ల వేళ ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి..

|

Sep 23, 2024 | 10:36 AM

ఆఫర్ల వర్షం కురిపించేందుకు ఈ కామర్స్‌ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ నెల 27వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సేల్స్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందించనున్నాయి. దీంతో కస్టమర్లకు తమకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. అయితే దీనిని అదునుగా చేసుకొని...

Online shopping: ఆఫర్ల వేళ ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి..
Online Shopping
Follow us on

ఆఫర్ల వర్షం కురిపించేందుకు ఈ కామర్స్‌ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ నెల 27వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సేల్స్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందించనున్నాయి. దీంతో కస్టమర్లకు తమకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. అయితే దీనిని అదునుగా చేసుకొని రెచ్చిపోయే సైబర్‌ నేరగాళ్లు కూడా పొంచి ఉన్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను క్యాష్‌ చేసుకొని డబ్బులు కాజేస్తుంటారు. ప్రతీ ఏటా ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మరి ఆఫర్ల పేరిట జరిగే సైబర్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

* ఈ సమయంలో గుర్తు తెలియని నెంబర్ల నుంచి కొన్ని మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చంటూ కొన్ని లింక్స్‌ను పంపిస్తుంటారు. అయితే పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్‌ చేస్తే ఇకే అంతే సంగతులు మీ వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్‌ నేరస్థుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. బ్యాంక్‌ అకౌంట్స్‌ కూడా హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.

* ఇక నకిలీ వెబ్‌సైట్స్‌తో కూడా కేటుగాళ్లు మోసం చేస్తుంటారు. అందుకే కచ్చితంగా అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత యాప్‌ నుంచే షాపింగ్‌ చేయాలి. అనధికారిక వెబ్‌సైట్స్‌లో బుక్‌ చేసుకోవడం వల్ల వస్తువులు రాకపోగా ఇతర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.

* ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే సమయంలో పబ్లిక్‌గా ఉచితంగా లభించే వైఫ్‌లను ఉపయోగించకపోవడమే మంచిది. వీటివల్ల హ్యాకర్స్‌ మీ వ్యక్తిగత వివరాలను, కార్డు వివరాలను కాజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ డేటా లేదా మీ ఇంట్లో వైఫైని మాత్రమే ఉపయోగించడం ఉత్తమం.

* ఇక యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ప్లే స్టోర్‌లో కూడా నకిలీ యాప్స్‌ వస్తున్నాయి. కాబట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకుంటోంది. అసలు యాపేనా చెక్‌ చేసుకొని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* ఈ కామర్స్‌లో షాపింగ్ చేసే సమయంలో మీ అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యి షాపింగ్ చేయండి. దీనివల్ల మీరు ఉపయోగిస్తున్న యాప్‌ సరైందో కాదో ఇట్టే తెలుసుకోవచ్చు. మీ పాత ఆర్డర్స్‌, రివార్డ్‌ పాయింట్స్‌ చెక్‌ చేసుకొని వస్తువులను బుక్‌ చేసుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..