భూమి ఉన్నది గుండ్రంగానా.. లేదా ఫ్లాట్‌గానా? అసలు ఆ సైంటిస్టుల కొత్త వాదనలేంటి?

మనందరం భూమి గుండ్రండా ఉందని.. సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చదువుకున్నాం కదా.. మనం అలానే నమ్ముతున్నాం కూడా. కానీ ఫ్లాట్ ఎర్త్ థియరిస్టులు మాత్రం భూమి గుండ్రంగా ఉందనడాన్ని కొట్టి పారేస్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం భూమి గుండ్రంగా లేదని.. బల్ల లాగా ఫ్లాట్ గా ఉందని అంటున్నారు. ఫ్లాట్ డిస్క్ షేపులో ఉన్న భూమిని… గుండ్రంగా ఉందని అమెరికా ప్రచారం చేస్తోందనీ, అది నిజం కాదనీ వాళ్లు వాదిస్తున్నారు. అంతేకాదు… భూమి పెరీమీటర్… అంటార్కిటికా పరిసరాల్లో […]

  • Updated On - 5:15 pm, Wed, 20 March 19 Edited By:
భూమి ఉన్నది గుండ్రంగానా.. లేదా  ఫ్లాట్‌గానా? అసలు ఆ సైంటిస్టుల కొత్త వాదనలేంటి?

మనందరం భూమి గుండ్రండా ఉందని.. సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చదువుకున్నాం కదా.. మనం అలానే నమ్ముతున్నాం కూడా. కానీ ఫ్లాట్ ఎర్త్ థియరిస్టులు మాత్రం భూమి గుండ్రంగా ఉందనడాన్ని కొట్టి పారేస్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం భూమి గుండ్రంగా లేదని.. బల్ల లాగా ఫ్లాట్ గా ఉందని అంటున్నారు. ఫ్లాట్ డిస్క్ షేపులో ఉన్న భూమిని… గుండ్రంగా ఉందని అమెరికా ప్రచారం చేస్తోందనీ, అది నిజం కాదనీ వాళ్లు వాదిస్తున్నారు. అంతేకాదు… భూమి పెరీమీటర్… అంటార్కిటికా పరిసరాల్లో ఉందని వాళ్లు అంటున్నారు. ఓ ప్లేట్ ఆకారంలో బల్లలాగా ఉన్న భూమి చుట్టూ… ఐస్ గడ్డకట్టి ఓ గోడలా ఉందని వాళ్లు చెబుతున్నారు. అందుకు సంబంధించి తాము రిలీజ్ చేసిన ఫొటోలను చూడమంటూ సవాల్ విసురుతున్నారు.

2020లో ఈ ఫ్లాట్ ఎర్త్ థియరిస్టులు… అంటార్కిటికా ఖండానికి వెళ్లబోతున్నట్లు తెలిపారు. అక్కడ భూమిని ఫొటోలు తీసి… ప్రపంచానికి చూపిస్తామంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఫ్లాట్ ఎర్త్ సొసైటీని స్థాపించుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలోని డల్లాస్‌లో వీళ్లు ఓ అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఇదివరకు రెండుసార్లు ఇలాంటి మీటింగ్ పెట్టారు. అప్పుడు కూడా ఇలాగే ఫ్లాట్ ఎర్త్ సిద్ధాంతాన్ని బలపరిచారు.

వీళ్లు ఎన్ని చెబుతున్నా… భూమి ఫ్లాట్‌గా ఉందంటే మోజారిటీ పబ్లిక్ మాత్రం నమ్మడం లేదు. ఎందుకంటే… గుండ్రంగా ఉన్న భూమి ఫొటోలు చూసీ, చూసీ మనకు భూమి అంటే అలాగే ఉంటుందనే అభిప్రాయం ఏర్పడింది. అంతేకాదు గూగుల్ ఎర్త్ లాంటి వెబ్‌సైట్లలో కూడా భూమి గుండ్రంగానే కనిపిస్తోంది. మన ఇస్రో వెబ్ సైట్లలో కూడా భూమి రౌండ్‌గానే ఉంటుంది. ఇదివరకు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములంతా భూమి గుండ్రంగానే ఉందని చెప్పారు. కానీ ఫ్లాట్ ఎర్త్ థియరిస్టులు మాత్రం అమెరికా, నాసాను తప్పుపడుతున్నారు. నిజమైన భూమి ఫొటోలను చూపించకుండా… గ్రాఫిక్స్ ఫొటోలను చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతే కాదు… చంద్రుడిపై ప్రయాణానికి సంబంధించి కూడా నాసా… ఫేక్ ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

అయితే విచిత్రమేంటంటే… ఈమధ్య కాలంలో ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. చాలా మంది యూఫాలజిస్టులు, ఖగోళ శాస్త్రవేత్తలు… అమెరికా సిద్ధాంతాలను వ్యతిరేకిస్తుంటారు. అలాంటి వాళ్లు ఈ కొత్త సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. అందువల్ల దీనిపై క్రేజ్ పెరుగుతోంది.