Cola Smartphone: స్మార్ట్‌ ఫోన్‌ను పరిచయం చేయనున్న కూల్‌ డ్రింక్‌ కంపెనీ.. మార్కెట్లోకి కోకాకోలా స్మార్ట్‌ ఫోన్స్‌..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jan 27, 2023 | 8:42 AM

కోకాకోలా అనే పేరు చెప్పగానే అందరికీ కూల్‌ డ్రింక్స్‌ మాత్రమే గుర్తుకొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు కూల్‌ డ్రింక్స్‌కు మాత్రమే పరిమితమైన కోకాకోలా కంపెనీ తాజాగా స్మార్ట్‌ ఫోన్‌ల..

Cola Smartphone: స్మార్ట్‌ ఫోన్‌ను పరిచయం చేయనున్న కూల్‌ డ్రింక్‌ కంపెనీ.. మార్కెట్లోకి కోకాకోలా స్మార్ట్‌ ఫోన్స్‌..
Cola Smartphone

కోకాకోలా అనే పేరు చెప్పగానే అందరికీ కూల్‌ డ్రింక్స్‌ మాత్రమే గుర్తుకొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు కూల్‌ డ్రింక్స్‌కు మాత్రమే పరిమితమైన కోకాకోలా కంపెనీ తాజాగా స్మార్ట్‌ ఫోన్‌ల తయారీ రంగంలోకి అడుగుపెడుతోంది. కోలా ఫోన్‌ పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌ను భారత్‌లోనూ విడుదల చేయనున్నట్లు.. భారత్‌కు చెందిన పాపులర్‌ టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ ట్వీట్‌ చేశారు. కోలా ఫోన్‌ (Cola Phone) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ కోసం కోకాకోలా ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీతో జట్టు కట్టిందని చెబుతూ ఫోన్‌కు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. మార్చి నెలాఖరున కోలా ఫోన్‌ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోల ఆధారంగా ఈ ఫోన్‌లో వెనుకవైపు రెండు కెమెరాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోలాకోలా నేరుగా ఫోన్‌లను తయారీ చేయకపోయినప్పటికీ రియల్‌మీ కంపెనీతో జట్టు కట్టిందని తెలుస్తోంది. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రియల్‌మీ 10 సిరీస్‌లో ఉన్న ఫీచర్లతో కోలా స్మార్ట్‌ ఫోన్‌లు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే కోలాకోలా నిజంగానే ఫోన్‌ను తయరా చేస్తుందా.? లేదా కేవలం బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఫోన్‌లను మాడిఫై చేసిన విడుదల చేస్తుందా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే కూల్‌డ్రింక్స్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేయడం ఇదే తొలిసారి కాదు. 2015లో పెప్సీ కూడా స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. పెప్సీ పీ1 పేరుతో షెన్‌జెన్‌ కూబే అనే కంపెనీతో కలిసి స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. అయితే తర్వాత కంపెనీ ఈ ఫోన్‌లను నిలిపి వేసింది. ఇక ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) సైతం పై ఫోన్‌ (Pi Phone) పేరుతో కొత్త గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu