అద్భుతాలు చేయగల మనుషులను సృష్టిస్తోన్న చైనా!

చైనా ఎప్పటికప్పుడు విభిన్న ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాలు విసురుతోంది. తాజాగా మనుషులపై అక్కడి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం అందరినీ అబ్బురపరుస్తోంది. వారి ప్రయోగం వల్ల మనుషులను నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చనే దిశగా ప్రపంచం ఆలోచనలు వెళుతున్నాయి. అద్భుత శక్తిగా మెదడు చైనాకు చెందిన జియాంకుయి అనే డాక్టర్ ఒక ప్రయోగం చేశారు. ఇప్పుడదే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ప్రయోగం చేసిన ఉద్దేశం ఒకటైతే, వచ్చిన ఫలితం మాత్రం సూపర్. హెచ్ఐవిని అరికట్టాలనే ఆలోచనతో సదరు డాక్టర్ […]

అద్భుతాలు చేయగల మనుషులను సృష్టిస్తోన్న చైనా!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:54 PM

చైనా ఎప్పటికప్పుడు విభిన్న ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాలు విసురుతోంది. తాజాగా మనుషులపై అక్కడి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం అందరినీ అబ్బురపరుస్తోంది. వారి ప్రయోగం వల్ల మనుషులను నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చనే దిశగా ప్రపంచం ఆలోచనలు వెళుతున్నాయి.

అద్భుత శక్తిగా మెదడు

చైనాకు చెందిన జియాంకుయి అనే డాక్టర్ ఒక ప్రయోగం చేశారు. ఇప్పుడదే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ప్రయోగం చేసిన ఉద్దేశం ఒకటైతే, వచ్చిన ఫలితం మాత్రం సూపర్. హెచ్ఐవిని అరికట్టాలనే ఆలోచనతో సదరు డాక్టర్ మనుషుల జన్యువుపై ప్రయోగం చేశారు. అయితే అది అసలు సమస్యకు పరిష్కారం ఇవ్వడం సంగతి పక్కన పెడితే వ్యక్తుల మెదడులను సూపర్ శక్తులుగా మలిచినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

అసలు ఆ చైనా డాక్టర్ చేసిందేమంటే. జన్యువులో మార్పులు చేయగలిగారు. పసి పిల్లల జన్యువులో పిండ దశలోనే మార్పులు చేశారు. ఇలా చేసి భవిష్యత్తులో హెచ్‌ఐవి వైరస్‌ను తరిమికొట్టగల సామర్ధ్యాన్ని సాధించాలనేది ఆయన ఆలోచన. అయితే ఆ ఫలితం రాలేదు కానీ మరో ఫలితం వచ్చింది. ఆ పసి పిల్లలకు గుర్తుంచుకునే శక్తి అమితంగా పెరిగింది. ఏదైనా చాలా తొందరగా నేర్చుకోగల శక్తి సాధ్యమైంది.

ఈ ప్రయోగం వల్ల అర్ధమైన విషయం ఏమంటే జన్యువులో మార్పులు చేసి శక్తివంతమైన మెదడు కలిగిన మనుషులను సృష్టించవచ్చు. చైనాకు చెందిన డాక్టర్ జియాంకుయి, శాస్త్రవేత్తల బృందంతో కలిసి గతేడాది నవంబర్‌లో తాము జన్యు మార్పుడి చేశామని వెల్లడించారు. ఇద్దరు ఆడ పిల్లలు ‘లులు, నన; అనే కవలల జన్యువుకు మార్పులు చేశారు. ఈ మార్పులతో ఆ ఇద్దరు పిల్లలకు పూర్తి స్థాయిలో రక్షణ ఉండటమే కాకుండా మెదడు శక్తి పెరుగుతుందనేది తాజాగా తేలిన విషయం.

జన్యు మార్పిడి చాలా వివాదాస్పదం చాలా ఏళ్ల క్రితం డాక్టర్ ఆల్సినో సిల్వ జన్యువుపై చాలా ప్రయోగాలు చేశారు. ఒక ఎలుక జన్యువుపై చేసిన ప్రయోగం ద్వారా దాని మొదడులో పలు మార్పులను గుర్తించారు. దాని కణానికి-కణానికి మధ్య ఉన్న బంధంలో అనూహ్య మార్పులు సంభవించాయి. మెదడుకి గాయాలైనప్పుడు త్వరగా కోలుకునేలా జన్యు మార్పడి ఉపయోగపడుతుందని ఆయన ఆ సందర్భంలో చెప్పారు.

ఎలుక మెదడు, మనుషుల మెదడు దాదాపుగా ఒకేలా ఉంటాయి. అయితే మెదడులు శక్తివంతంగా ఉండేందుకు జన్యువులో మార్పులు చేస్తే కొన్ని ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ ఆల్సినో చెబుతున్నారు. ఒక్కసారి మనుషుల్లో జన్యు మార్పిడి జరిగితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం అని అంటున్నారు. ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందట.

అద్భుతాలు చేయొచ్చు అయితే జన్యు మార్పిడి ద్వారా చాలా అద్భుతాలు చేయవచ్చు. దాని వల్ల కలిగే నష్టాలను దృష్టిలో పెట్టుకుని అవి తలెత్తకుండా చేయగలిగే విధంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి విజయవంతం అయితే అద్భుత ఫలితాలు వస్తాయి. హెచ్ఐవిని నివారించగలగడం, నల్లగా ఉన్నవారిని తెలుపుగా, పొట్టిగా ఉన్నవారిని పొడవుగా, లావుగా ఉన్నవారిని సన్నగా పుట్టించగల సామర్ధ్యాన్ని సాధించవచ్చు. ఎన్నో రోగాలను గట్టిగా ఎదుర్కోవచ్చు. అద్భుతాలు చూడొచ్చు.