వాట్సాప్ వేదికగా రెచ్చిపోతున్న కేటుగాళ్లకు చెక్

సోషల్ మీడియా వేదికగా కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను వేధిస్తున్న   ఈ కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుపోతుంది. అభ్యంతరకరమైన మేసేజ్ లు, అశ్లీల వీడియోలు పంపి మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నారు. కాగా.. ఇలాంటి కేటుగాళ్లు వాట్సాప్ వేదికగా మరింత చెలరేగిపోతున్నారు. అయితే.. వీరికి చెక్ పెట్టేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం నిర్ణయించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను, యువతులను వేధిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పేరొందిన కొంతమంది మహిళలు, […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:29 am, Sat, 23 February 19
వాట్సాప్ వేదికగా రెచ్చిపోతున్న కేటుగాళ్లకు చెక్

సోషల్ మీడియా వేదికగా కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను వేధిస్తున్న   ఈ కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుపోతుంది. అభ్యంతరకరమైన మేసేజ్ లు, అశ్లీల వీడియోలు పంపి మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నారు. కాగా.. ఇలాంటి కేటుగాళ్లు వాట్సాప్ వేదికగా మరింత చెలరేగిపోతున్నారు. అయితే.. వీరికి చెక్ పెట్టేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం నిర్ణయించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను, యువతులను వేధిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పేరొందిన కొంతమంది మహిళలు, జర్నలిస్టులు కూడా బాధితుల లిస్ట్ లో ఉంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులతో డాట్ అప్రమత్తమైంది. వేధింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణ ఫిర్యాదు చేసేందుకు ఒక ప్రత్యేకమైన మెయిల్ ను రూపిందించింది. ccaddndot@nic.in మెయిల్ కు బాధితులు ఫిర్యాదు పంపిన వెంటనే దాన్ని పోలీసులు, ప్రొడైడర్ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డాట్ వెల్లడించింది.