బ్రాడ్‌బ్యాండ్ యూజర్స్‌కు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. అన్ లిమిటెడ్ కాల్స్ కూడా..!

బ్రాడ్‌బ్యాండ్ యూజర్స్‌కు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. అన్ లిమిటెడ్ కాల్స్ కూడా..!

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.777 ప్లాన్‌ను మళ్లీ సబ్‌స్క్రైబర్ల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ గతంలో ఉన్నదే అయినప్పటికీ.. కొన్ని కారణాలవల్ల ఈ ప్లాన్‌కు బ్రేకులు వేసింది. ఈ ప్లాన్ గురించి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు దాదాపు తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఇదే ప్లాన్‌ను ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చింది. అయితే గతంలో కూడా అనేకమార్లు బీఎస్ఎన్ఎల్ పలు ప్లాన్లను తీసుకురావడం.. మళ్లీ వాటిని నిలిపివేయడం మాములుగా మారింది. అయితే ఈ సారి […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Dec 07, 2019 | 1:50 PM

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.777 ప్లాన్‌ను మళ్లీ సబ్‌స్క్రైబర్ల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ గతంలో ఉన్నదే అయినప్పటికీ.. కొన్ని కారణాలవల్ల ఈ ప్లాన్‌కు బ్రేకులు వేసింది. ఈ ప్లాన్ గురించి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు దాదాపు తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఇదే ప్లాన్‌ను ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చింది. అయితే గతంలో కూడా అనేకమార్లు బీఎస్ఎన్ఎల్ పలు ప్లాన్లను తీసుకురావడం.. మళ్లీ వాటిని నిలిపివేయడం మాములుగా మారింది.

అయితే ఈ సారి మాత్రం మళ్లీ తీసుకొచ్చిన ప్లాన్‌లో పలు మార్పులతో పాటుగా.. కొన్ని కొత్త బెనిఫిట్స్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లోకి ఎంటర్ అయ్యే బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు.. 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటాను పొందొచ్చు. అది కూడా 500 జీబీ వరకు. అయితే 500 జీబీ డేటా ముగిసిన తర్వాత.. డేటా స్పీడ్.. 50 ఎంబీపీఎల్ నుంచి 2 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్ గడువు 6 నెలలు. ఇక ఈ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ పీరియడ్ అయిపోయిన తర్వాత.. వేరే ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కూడా అయ్యే సౌలభ్యం ఉంది. అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu