ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ ‘ఎయిర్‌టెల్ టీవీ’ సేవలు…

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్… ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్‌‌టెల్ టీవీ సేవలు ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ లభించనున్నాయి. దీంతో వినియోగదారులు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపైనే కాకుండా.. ఇకపై డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్/ట్యాబ్లెట్ల ద్వారా వెబ్‌బ్రౌజ‌ర్లలో ఎయిర్‌టెల్ టీవీ సేవ‌ల‌ు పొందవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ టీవీ వెబ్‌వెర్షన్‌లో ప‌రిమిత సంఖ్యలో మాత్రమే వీడియోలు, ఇత‌ర లైవ్ టీవీ సేవ‌లను అందుబాటులో ఉంచారు. త్వర‌లో పూర్తిస్థాయిలో అన్ని వీడియో స‌బ్‌స్క్రిప్షన్ స‌ర్వీసులు, లైవ్ టీవీ సేవ‌ల‌ు కూడా అందుబాటులోకి రానున్నాయి. […]

  • Publish Date - 6:20 pm, Mon, 6 May 19 Edited By:
ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ 'ఎయిర్‌టెల్ టీవీ' సేవలు...

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్… ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్‌‌టెల్ టీవీ సేవలు ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ లభించనున్నాయి. దీంతో వినియోగదారులు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపైనే కాకుండా.. ఇకపై డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్/ట్యాబ్లెట్ల ద్వారా వెబ్‌బ్రౌజ‌ర్లలో ఎయిర్‌టెల్ టీవీ సేవ‌ల‌ు పొందవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ టీవీ వెబ్‌వెర్షన్‌లో ప‌రిమిత సంఖ్యలో మాత్రమే వీడియోలు, ఇత‌ర లైవ్ టీవీ సేవ‌లను అందుబాటులో ఉంచారు. త్వర‌లో పూర్తిస్థాయిలో అన్ని వీడియో స‌బ్‌స్క్రిప్షన్ స‌ర్వీసులు, లైవ్ టీవీ సేవ‌ల‌ు కూడా అందుబాటులోకి రానున్నాయి.

సేవలు పొందాలంటే…

  • ఎయిర్‌టెల్ టీవీ వెబ్ సేవలను పొందడానికి వినియోగదారులు మొదటగా https://www.airtelxstream.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.
  • తర్వాత వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • నమోదు చేయగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయాల్సి ఉంటుంది.
    దీంతో సభ్యత్వ పక్రియ పూర్తయినట్లే. ఇక నిశ్చితంగా ఎయిర్‌టెల్ టీవీ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.