ఆటో ఛార్జీ విని షాకైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. పూణెలో ఆటో డ్రైవర్స్ మోసాలు

నగరాల్లో ఆటో డ్రైవర్ల మోసాలు అన్నీఇన్నీ కావు. కొత్తగా నగరానికి వచ్చిన వారెవరైనా తాము చేరుకోవాల్సిన అడ్రస్ తెలియక చాలమంది సహజంగా ఆటో ప్రయాణమే బెస్ట్ అని భావిస్తారు. ఎందుకంటే ఆటో డ్రైవర్‌కి ఆయా ప్రాంతాలపై మంచి పట్టు ఉంటుంది. వీధులన్నీ బాగా తెలిసి ఉంటాయి. ఎక్కడ ఎలా వెళ్లాలో కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఆటో ప్రయాణానికి అయ్యే ఖర్చు పెద్దగా ఉండదు, పైగా మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే ఆపే వెసులుబాటు కూడా ఉంటుంది […]

ఆటో ఛార్జీ విని షాకైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. పూణెలో ఆటో డ్రైవర్స్ మోసాలు
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2019 | 5:14 PM

నగరాల్లో ఆటో డ్రైవర్ల మోసాలు అన్నీఇన్నీ కావు. కొత్తగా నగరానికి వచ్చిన వారెవరైనా తాము చేరుకోవాల్సిన అడ్రస్ తెలియక చాలమంది సహజంగా ఆటో ప్రయాణమే బెస్ట్ అని భావిస్తారు. ఎందుకంటే ఆటో డ్రైవర్‌కి ఆయా ప్రాంతాలపై మంచి పట్టు ఉంటుంది. వీధులన్నీ బాగా తెలిసి ఉంటాయి. ఎక్కడ ఎలా వెళ్లాలో కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఆటో ప్రయాణానికి అయ్యే ఖర్చు పెద్దగా ఉండదు, పైగా మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే ఆపే వెసులుబాటు కూడా ఉంటుంది గనుక. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని చాలమంది ఆటో డ్రైవర్లు కొత్తవారిని ఇట్టే మోసం చేస్తుంటారు.

హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో కొంతమంది ఆటో డ్రైవర్లు చాకచక్యంగా చేసే మోసాలకు ఎంతోమంది ప్రయాణికులు తమ జేబులు ఖాళీ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఓ ఆటోడ్రైవర్ మోసం వెలుగులోకి వచ్చింది. కేవలం 18 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినందుకు ఓ ప్రయాణికుడి నుంచి అక్షరాల రూ.4,600 వసూలు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పూణె వెళ్లాల్సి వచ్చింది. అక్కడ స్ధానికంగా కత్రాజ్ అనే ప్రాంతం నుంచి ఎరవాడ అనే మరో ప్రాంతానికి వెళ్లాల్సివచ్చింది. ఈ రెండిటి మధ్య దూరం 18 కిలోమీటర్లు వరకు ఉంటుంది. దీంతో సచిన్ సమ్‌దేవ్ అజంతారావు అనే వ్యక్తికి చెందిన ఆటో ఎక్కాడు. అనుకున్నట్టుగానే ఆ ప్రయాణికుణ్ని ఎరవాడలో దించాడు ఆటో డ్రైవర్. ఆటో ఎక్కిన హడావిడిలో ఆటోకు ఉన్న మీటర్ రీసెట్ చేశాడా లేదా అనే విషయాన్ని గమనించలేదు. అయితే ఆటో దిగిన తర్వాత ఆటో ఛార్జీ ఎంతివ్వాలి అనే సరికి ఆటో డ్రైవర్ చెప్పిన మాట విని ప్రయాణికుడికి కళ్లుతిరిగనంత పనైంది. కత్రాజ్ నుంచి ఎరవాడలో దించినందుకు తనకు ఆటో ఛార్జీ రూ.4600 ఇవ్వాలన్నాడు. అదేంటీ కేవలం 18 కిలోమీటర్లే కదా అని ప్రశ్నించినా లాభం లేకపోయింది. ఆ ప్రాంతం చీకటిగా ఉండటం, చుట్టూ ఎవరూ లేకపోవడంతో ..అసలే స్ధానికేతరుడైన బెంగళూరు వాసికి ఆటో డ్రైవర్ మోసం చేస్తున్నట్టు అర్ధమైంది. అప్పటికే డబ్బులు ఇచ్చేసి..ఈవిషయాన్ని వెంటనే తన స్నేహితుల సాయంతో ట్రాఫిక్ కంట్రోల్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో స్ధానిక ఎస్సైకి కూడా సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మోసానికి పాల్పడ్డ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తాను మోసం చేసినట్టు ఆటో డ్రైవర్ అంగీకరించాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.