గులాబీ రంగులో సరస్సు నీరు… స్టడీకి రీసెర్చర్లు రెడీ !

మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాల్లో లోనార్ సరస్సు నీరు గులాబీ (పింక్) రంగులోకి మారడానికి గల కారణాలను కనుగొనబోతున్నారు. నాగపూర్ లోని నేషనల్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్ టి ట్యూట్ కి చెందిన రీసెర్చర్ల..

గులాబీ రంగులో సరస్సు నీరు... స్టడీకి రీసెర్చర్లు రెడీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 13, 2020 | 5:49 PM

మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాల్లో లోనార్ సరస్సు నీరు గులాబీ (పింక్) రంగులోకి మారడానికి గల కారణాలను కనుగొనబోతున్నారు. నాగపూర్ లోని నేషనల్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్ టి ట్యూట్ కి చెందిన రీసెర్చర్ల బృందం వచ్ఛేవారం ఈ సరస్సును విజిట్ చేసి ఇందులోని నీటి శాంపిల్స్ ని సేకరిస్తుందని అధికారులు తెలిపారు. సుమారు 50 వేల సంవత్సరాల క్రితం ఓ ఉల్క ఈ ప్రదేశాన్ని బలంగా ఢీ కొన్నదని చెబుతారు. 1.2 కి.మీ. వైశాల్యం ఉన్న ఈ సరస్సును చూడడానికి అనేకమంది టూరిస్టులు వస్తుంటారు. ఇటీవలే ఈ లేక్ లోని నీరు పింక్ వర్ణం లోకి మారడం స్థానికులను, ప్రకృతి ప్రేమికులను కూడా ఆశ్చర్యపరిచింది. బహుశా  ఈ నీటిలో ఆల్గే ఉండడంవల్లే ఇలా జరిగి ఉండవచ్ఛునని అంటున్నారు. నీటి రంగు మారడం ఇదే మొదటిసారి కాదని, కానీ ఈ సారి  ఇంత ప్రస్ఫుటంగా కనిపించడం మాత్రం ఇదే తొలి సారని  అంటున్నారు. లోనార్ సరస్సుప్రాంతాన్ని మొదట 1823 లో అలెగ్జాండర్ అనే బ్రిటిష్ అధికారి అసాధారణ భౌగోళిక సైట్ గా గుర్తించాడట.