ఆ రోజే… టీమిండియా కోచ్‌ ప్రకటన!

Team India’s next head coach to be announced on August 16

తాజాగా భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న అంశం తదుపరి టీమిండియా కోచ్‌ ఎవరు? కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నియామక ప్రక్రియ కోసం బీసీసీఐ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిని క్రికెట్‌ సలహా కమిటీ టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపికను చేపట్టనుంది. ఈ బృందం ఇప్పటివరకు అందిన దరఖాస్తుల నుంచి ఆరుగురిని షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ ఆరుగురిని శుక్రవారం(ఆగస్టు 16) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ చేయనుంది. అదే రోజున కోచ్‌ ఫలితాలు కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.

టీమిండియా ప్రధాన కోచ్‌ రేసులో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు ఉన్నారు. ఈ ఆరుగురికి మాత్రమే కపిల్‌ దేవ్‌ కమిటీ ఇంటర్వ్యూలు చేయనుంది. ఇక సారథి విరాట్‌ కోహ్లి రవిశాస్త్రి వైపే మొగ్గుచూపడంతో అతడినే మళ్లీ ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను బీసీసీఐ కొట్టిపారేసింది. కోచ్‌ను ఎంపిక చేసిన అనంతరం.. కోచ్‌, కెప్టెన్‌ ఇష్టం మేరకు మిగతా సిబ్బందిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *