టీమిండియా సూపర్ ఫ్యాన్ మృతి.. తీవ్ర విషాదంలో ఆటగాళ్లు!

చారులతా పటేల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 87 ఏళ్ళ వయసు కలిగిన ఈవిడ టీమిండియాకు పెద్ద ఫ్యాన్. జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి వారిలో జోష్ నింపుతారు. ఈమెకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంటే అమితమైన ఇష్టం. వారి ఆటను దగ్గర నుంచి తిలకిస్తూ చిన్న పిల్లలా సంబరపడిపోతుంటారు. ఇక ఆ ఇద్దరూ కూడా ఈ బామ్మ అభిమానానికి మంత్రముగ్దులయ్యి వన్డే వరల్డ్ కప్ సమయంలో ప్రత్యేకంగా […]

టీమిండియా సూపర్ ఫ్యాన్ మృతి.. తీవ్ర విషాదంలో ఆటగాళ్లు!
Follow us

|

Updated on: Jan 17, 2020 | 12:38 PM

చారులతా పటేల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 87 ఏళ్ళ వయసు కలిగిన ఈవిడ టీమిండియాకు పెద్ద ఫ్యాన్. జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి వారిలో జోష్ నింపుతారు. ఈమెకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంటే అమితమైన ఇష్టం.

వారి ఆటను దగ్గర నుంచి తిలకిస్తూ చిన్న పిల్లలా సంబరపడిపోతుంటారు. ఇక ఆ ఇద్దరూ కూడా ఈ బామ్మ అభిమానానికి మంత్రముగ్దులయ్యి వన్డే వరల్డ్ కప్ సమయంలో ప్రత్యేకంగా కలిశారు. అయితే ఇటీవల చారులతా పటేల్ అనారోగ్యం బారిన పడి కన్నుమూశారు. ఇక ఈ విషయాన్ని లండన్‌లో ఉన్న ఆమె కుటుంబీకులు వెల్లడించారు.

1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ ప్రపంచకప్ దక్కించుకున్న వేళ ఈమె లార్డ్స్‌ స్టేడియంలోనే ఉంది. భారత సంతతికి చెందిన చారులతా పటేల్ విదేశాల్లోనే పుట్టి పెరిగింది. కాగా, ఆమె మృతి పట్ల బీసీసీఐ సంతాపం తెలిపింది. ఆమె ఎల్లప్పుడూ తమ మనసుల్లోనే ఉంటారని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామంటూ ట్వీట్ చేసింది.