Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

బాగా ఆడుతున్నానని.. కిడ్నాప్ చేశారు: అశ్విన్

Team India spinner Ravichandran Ashwin says he was Kidnapped, బాగా ఆడుతున్నానని.. కిడ్నాప్ చేశారు: అశ్విన్

నేను బాగా ఆడతానని నన్ను కిడ్నాప్ చేశారని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన టీనేజ్ గురించి చెప్పుకొచ్చాడు. క్రికెట్ వల్ల తాను చిన్నప్పటి నుంచే ఎన్నో సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చిందని పేర్కొన్నాడు. నేను కిడ్నాప్ అవుతున్న విషయం కూడా నాకు తెలీదని, అంత తెలివిగా చేశారని నవ్వుతూ చెప్పాడు.

‘నా చిన్నప్పుడు ఇంటి వద్దే రోడ్ల మీద ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్లం. ఇలా ఆడటం మా నాన్నకు ఏమాత్రం నచ్చేది కాదు. కానీ ఆ తరువాత నన్ను అర్థం చేసుకున్నారు. అలా ఒకానొక రోజు మా టీం ప్రత్యర్థి జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడాలి. నేను ఇంటి నుంచి హడావిడిగా బయలు దేరాను. ఇంతలో ఓ నలుగురు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద వచ్చారు. పద మనం వెళ్లాలి అన్నారు. నాకు డౌట్ వచ్చి మీరెవరు? అని అడిగాను. దానికి సమాధానంగా వారు నువ్విక్కడ మ్యాచ్ ఆడుతున్నావంట కదా.. అందుకే తీసుకువెళ్లడానికి వచ్చామన్నారు. ఇది విన్న నేను అబ్బో.. నాకోసం బండి పంపించారా? అంటూ సంబరపడి బండి ఎక్కాను.

కొంచెం ముందుకు వెళ్లాక ఓ టీ షాపు ముందు ఆపి.. నాకు బజ్జీలు, వడలు కొనిపెట్టారు. అలా మాట్లాడుకుంటూనే.. మ్యాచ్ టైం అయ్యింది. దీంతో వారిని నేను కంగారు పెట్టగా.. మెల్లగా అసలు విషయం బయటపెట్టారు. అలాగే.. ఈ మ్యాచ్ ఆడితే నీ చేతి వేళ్లు కట్ చేస్తామని బెదిరించారు. దాంతో ఇంక నేను సైలెంట్‌గా అక్కడే కూర్చొన్నా. మ్యాచ్ టైం అయిపోయాక.. నన్ను ఇంటి ముందు దిగబెట్టేశారు. మా ప్రత్యర్థి టీం వాళ్లే ఈ పని చేశారు. అలా క్రికెట్ కోసం చిన్నప్పుడే నన్ను కిడ్నాప్’ చేశారని.. సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు అశ్విన్.

Related Tags