ఆస్ట్రేలియాపై టీమిండియా ఆసక్తిర రికార్డ్

రాంచి: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు ముగిశాయి. అందులో రెండు భారత్ గెలవగా, ఒకటి ఆసిస్ గెలిచింది. దీంతో సిరీస్ 2-1తో భారత్‌కే పైచేయి ఉంది. విశాఖ, హైదరాబాద్‌లలో జరిగిన మ్యాచ్‌లలో భారత్ నెగ్గగా, రాంచిలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన రికార్డ్ నమోదయ్యింది. ఈ మూడు మ్యాచ్‌లలోనూ భారత్ 48.2 ఓవర్లు ఆడింది. ఇలా వరుసగా మూడు వన్డే మ్యాచ్‌లలో 48.2 […]

ఆస్ట్రేలియాపై టీమిండియా ఆసక్తిర రికార్డ్
Follow us

|

Updated on: Mar 09, 2019 | 10:36 AM

రాంచి: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు ముగిశాయి. అందులో రెండు భారత్ గెలవగా, ఒకటి ఆసిస్ గెలిచింది. దీంతో సిరీస్ 2-1తో భారత్‌కే పైచేయి ఉంది. విశాఖ, హైదరాబాద్‌లలో జరిగిన మ్యాచ్‌లలో భారత్ నెగ్గగా, రాంచిలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన రికార్డ్ నమోదయ్యింది.

ఈ మూడు మ్యాచ్‌లలోనూ భారత్ 48.2 ఓవర్లు ఆడింది. ఇలా వరుసగా మూడు వన్డే మ్యాచ్‌లలో 48.2 ఓవర్ల వరకు మాత్రమే ఆడటం యాదృచ్ఛికమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ అలా జరగలేదు. దీంతో ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా ఆసక్తికరమైన రికార్డ్ నమోదు చేసినట్టైంది.