టీమిండియా పేసర్ సిరాజ్‌ తండ్రి మహ్మద్ గౌజ్‌ కన్నుమూత..ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చే ఛాన్స్

టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ తండ్రి మహ్మద్ గౌజ్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మహ్మద్ గౌజ్‌ శుక్రవారం కన్నుమూశారు.

  • Sanjay Kasula
  • Publish Date - 11:10 pm, Fri, 20 November 20

Mohammed Siraj Father Passes Away : టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ తండ్రి మహ్మద్ గౌజ్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మహ్మద్ గౌజ్‌ శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.

ఐపీఎల్‌లో సత్తాచాటి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిరాజ్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బయోబబుల్‌లో ఉండటంతో అతడు అంత్యక్రియలకు దూరం కానున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్‌ భారత క్రికెటర్‌గా ఎదగడంలో తన తండ్రి కీలకపాత్ర పోషించారు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ సిరాజ్‌ కలను ప్రోత్సహించారు. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు రూ.2.6 కోట్లకు సొంతం చేసుకోవడంతో సిరాజ్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇటీవల బెంగళూరు తరఫున సిరాజ్‌ మంచి ఆటతీరును  ప్రదర్శించిన సంగతి తెలిసిందే.