క్లీన్ స్వీప్‌పై కన్నేసిన కోహ్లీసేన..! మరి వరుణుడు ఏం చేయబోతున్నాడో..!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆఖరి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి.. సిరస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలి మ్యాచ్‌ ధర్మశాలలో వర్షార్పణం కాగా.. ఇక మొహాలీలో జరిగిన రెండో టీ-20లో దక్షిణాఫ్రికాపై గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండో టీ20లో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి.. భారత్‌కు బ్రహ్మాండమైన […]

క్లీన్ స్వీప్‌పై కన్నేసిన కోహ్లీసేన..! మరి వరుణుడు ఏం చేయబోతున్నాడో..!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 3:24 AM

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆఖరి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి.. సిరస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలి మ్యాచ్‌ ధర్మశాలలో వర్షార్పణం కాగా.. ఇక మొహాలీలో జరిగిన రెండో టీ-20లో దక్షిణాఫ్రికాపై గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండో టీ20లో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి.. భారత్‌కు బ్రహ్మాండమైన విజయాన్ని అందించాడు. ఓపెనర్ రోహిత్ త్వరగానే పెవిలియన్ బాటపట్టినప్పటికీ.. ధావన్ 40 పరుగులు చేయగా.. విరాట్ 72 పరుగులు చేశాడు.అయితే ఈ మ్యాచ్‌తోనే శిఖర్ ధావన్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు మరింత బలాన్ని ఇస్తోంది.

అయితే అసలు టెన్షన్ అంతా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించే. చెత్త షాట్లు కొడుతూ.. వికెట్ సమర్పించుకుంటుండటం అలవాటుగా మారింది. ఇప్పటికే పంత్‌కు చాలా అవకాశాలు లభించాయి. టీమిండియా కోచ్ రవి శాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ రిషబ్‌పై నమ్మకంతో కంటిన్యూ చేయిస్తున్నారు. అయితే ఈ చివరి టీ20 మ్యాచ్‌తో తన ప్రతిభను చూపించుకునేందుకు ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక మిడిలార్డర్ శ్రేయాస్ అయ్యర్, మానిష్ పాండే, పాండ్యా బ్రదర్స్‌తో పటిష్టంగా ఉంది.

మరోవైపు ఎలాగైనా ఆఖరి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లీసేన చూస్తుంటే.. భారత్ ఆశలకు బ్రేకులు వేసి.. సిరీస్‌ను సమం చేసేందుకు సఫారీలు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. అసలు ఈ చివరి టీ20 జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తొలి మ్యాచ్‌ను ఏ విధంగానైతే వరుణుడు అడ్డుకున్నాడో.. బెంగళూరు మ్యాచ్‌లో కూడా తన ప్రతాపం చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడంతో ఇవాళ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని.. ఇక మ్యాచ్‌ జరిగే సమయంలో 30-40% వర్షం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరి టీమిండియా క్లీన్ స్వీప్ చేసేందుకు వరుణుడు కరుణిస్తాడా.. లేదా అన్నది మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.