ధోనీని నేను ఆపలేదు బాబోయ్: టీమిండియా కోచ్

Team India Coach Sanjay Bangar opens up on MS Dhonis batting position in world cup 2019, ధోనీని నేను ఆపలేదు బాబోయ్: టీమిండియా కోచ్

ఇటీవలే ఇంగ్లాడ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో ధోనీని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కి పంపడంపై అభిమానులు తెగ ఫీల్ అయ్యారు. వారి వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. ఈ వార్త హోరెత్తింది. బీసీసీ వరకూ ఈ వార్త చేరింది. ధోనీని బ్యాటింగ్ ఆర్డర్ వెనక్కి పంపిన కోచ్‌ ఎవరు..? అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని వార్తలు తెగ ట్రోల్ అయ్యాయి. ఈ సందర్భంగా టీమిండిమా కోచ్ సంజయ్ భంగర్ దీనిపై వివరణ ఇచ్చారు.

ధోని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో తనకేమీ సంబంధం లేదనీ.. టీమిండియా మేనేజ్‌మెంట్‌లోని అందరూ కలిసి.. అప్పటి మ్యాచ్ పరిస్థితుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇందులో తన తప్పేమీ లేదని చెప్పారు. డెత్ ఓవర్లలో ధోనీ క్రీజులో ఉండాలనే ఉద్ధేశ్యంతోనే అలా బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి పంపడం జరిగిందని.. కానీ.. అందరూ నన్ను తప్పుబట్టడం.. ఎంతో బాధగా ఉందని పేర్కొన్నారు. అసలు ఈ విషయంలో నన్ను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్ భంగర్.

కాగా.. వారల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో.. ఇండియా 240 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లు పోగొట్టుకుంది. రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (1), విరాట్ కొహ్లీ (1), రిషబ్ పంత్ (32), దినేశ్ కార్తీక్ (6). హార్దిక్ పాండ్యా (32), ధోనీ (50), జడేజా (77) ఆడారు. భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *