India Vs Australia 2021: విజయతీరానికి 110 పరుగుల దూరంలో టీమిండియా.. క్రీజ్‌లో రాణిస్తున్న పంత్, పుజారా..

India Vs Australia 2020: బ్రిస్బెన్‌ వేదికగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా గెలుపువైపు దూసుకుపోతోంది.

India Vs Australia 2021: విజయతీరానికి 110 పరుగుల దూరంలో టీమిండియా.. క్రీజ్‌లో రాణిస్తున్న పంత్, పుజారా..
Follow us

|

Updated on: Jan 19, 2021 | 1:43 PM

India Vs Australia 2021: బ్రిస్బెన్‌ వేదికగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా గెలుపువైపు దూసుకుపోతోంది. మూడో సెషన్ పూర్తయ్యే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మరో110 పరుగులు చేస్తే టీమిండియా విజయతీరానికి చేరనుంది. అయితే టీమిండియా విజయానికి 25 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ప్రస్తుతం రిషబ్ పంత్ 32(63), చటేశ్వర్ పుజారా 52(200) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభిస్తున్నప్పటికీ పంత్, పుజారా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్‌ను పెంచుతున్నారు. కాగా, అంతకు ముందు కెప్టెన్ అజింక్య రహానె 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే, నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియా చెరో మ్యాచ్‌లో గెలిచాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ కైవసం అవుతుంది. ఒకవేళ మ్యాచ్‌ డ్రా అయినా పాయింట్ల ఆధారంగా టీమిండియాకే ట్రోఫీ సొంతం అవుతుంది.

Also read:

Telangana Corona Update: తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..

యూపీ బాటలో మరో రాష్ట్రం , ‘లవ్ జిహాద్’ కింద మధ్యప్రదేశ్ లో తొలి కేసు నమోదు, బాధితురాలి ఫిర్యాదుపై ట్రక్ డ్రైవర్ అరెస్టు