హోమ్‌ ‌ట్యూటర్లుగా మారుతున్న ప్రైవేట్ టీచర్లు

కరోనా కారణంగా విద్యావ్యవస్థ స్వరూపమే మారిపోయింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ప్రస్తుత కాంపిటీషన్ యుగంలో తమ పిల్లలు వెనుకబడకుండా ఉండేందుకు ఇంటి వద్దే ట్యూషన్ చెప్పిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు.

హోమ్‌ ‌ట్యూటర్లుగా మారుతున్న ప్రైవేట్ టీచర్లు
Follow us

|

Updated on: Jul 17, 2020 | 6:37 PM

కరోనా కారణంగా విద్యావ్యవస్థ స్వరూపమే మారిపోయింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ప్రస్తుత కాంపిటీషన్ యుగంలో తమ పిల్లలు వెనుకబడకుండా ఉండేందుకు ఇంటి వద్దే ట్యూషన్ చెప్పిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు.

హైదరబాద్ మహానగరంలో ట్యూషన్లకు డిమాండ్‌ పెరుగుతుండడంతో ప్రైవేట్ ​టీచర్స్‌ హోమ్‌ ‌ట్యూటర్లుగా మారుతున్నారు. స్కూల్ వాళ్లు చెప్పే ఆన్‌లైన్‌ క్లాసులు పిల్లలకు సరిగ్గా అర్థం కాకపోవడంతో చదువులో వెనుకపడకుండా హోం ట్యూషన్లను ప్రోత్సాహిస్తున్నారు. ఇక గంటల తరబడి లాప్ టాప్ , సెట్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల కొత్తగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని టెన్షన్ ​పడుతున్నా పేరెంట్స్.. పిల్లల కోసం సబ్జెక్ట్స్ ట్యూటర్స్​ను ఏర్పాటు చేసుకుంటున్నారు. స్కూల్స్​ లేక ఫైనాన్షియన్షిల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్​ టీచర్స్ కు ఇది కొంత ఊరటనిస్తోంది.

ప్రైవేట్ స్కూల్స్​లో ఫీజు వసూలు చేస్తేనే జీతాలు ఇస్తామంటున్నాయి. ఇలా నగరంలో 40వేల మంది దాకా టీచర్లు వర్క్ చేస్తుంటారు. లాక్ డౌన్ మూలంగా స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. 3 నెలలుగా ప్రముఖ విద్యాసంస్థలతో చిన్న చితక పాఠశాలలు టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి. అటు లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన విద్యావంతులు కూడా కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ఆర్టికంగా చితకిపోయిన వాళ్లంతా హోం టూషన్లను అందిపుచ్చకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకుంటున్నారు. అన్నిరకాల సబ్జెక్ట్స్ ల్లో అనుభవం ఉన్న టీచర్లను బయోడేటాతో ఆన్​లైన్ లో, పేపర్స్ లో యాడ్స్ కూడా ఇస్తున్నారు. క్లాస్, సబ్జెక్ట్ వైజ్ గా ఫీజు వసూలు చేస్తున్నారు. నెలకి రూ.3 వేల నుంచి 15 వేల వరకు సంపాదిస్తున్నారు. అందివచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటు విద్యార్ధులు సబ్జెక్ట్ లో వెనుకబడకుండా పాఠాలు చెబుతూనే, తమను తాము ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.