ప్రైవేట్ స్కూల్ బస్సులకు నో ఎంట్రీ.. టీచర్ల వినూత్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా దాతరుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వినూత్న ఆందోళన చేశారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు తమ గ్రామంలోకి రావద్దంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన పాఠశాల బస్సులను ఆపేసి.. రోడ్డు పై బైఠాయించారు. ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ బడే ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. గ్రామంలోని పిల్లలందరూ జిల్లా పరిషత్ స్కూల్‌లోనే చదవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తమ […]

ప్రైవేట్ స్కూల్ బస్సులకు నో ఎంట్రీ.. టీచర్ల వినూత్న నిరసన
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 18, 2019 | 6:32 PM

యాదాద్రి భువనగిరి జిల్లా దాతరుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వినూత్న ఆందోళన చేశారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు తమ గ్రామంలోకి రావద్దంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన పాఠశాల బస్సులను ఆపేసి.. రోడ్డు పై బైఠాయించారు. ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ బడే ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. గ్రామంలోని పిల్లలందరూ జిల్లా పరిషత్ స్కూల్‌లోనే చదవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పాఠశాలలో ఉండే మౌలిక సదుపాయాల గురించి వివరించారు.