Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ ఎన్నికలకు పచ్చజెండా. జూన్ 19న ఎన్నికలకు ముహూర్తం ఖరారు. కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డ ఎన్నికలు. చాలా సీట్లు ఏకగ్రీవ ఎన్నిక. 18 స్థానాలకు ఏర్పడ్డ పోటీ. 18 స్థానాలకు జరగనున్న ఎన్నికలు.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం రెండు ప్యాకేజీలు. ఖాయిలా పడ్డ పరిశ్రమల కోసం రూ. 20వేల కోట్లతో ఒక ప్యాకేజి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరుతో రూ. 50వేల కోట్లతో ఈక్విటీ. కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు.
  • కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. తిరువనంతపురంలో భారీ వర్షం. వాతావరణ శాఖ అంచనాల మేరకు కదులుతున్న రుతుపవనాలు. రెండు వారాల్లో దక్షిణాది మొత్తం విస్తరించే అవకాశం.
  • కొసాగగుతున్న నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ ఏపీ ప్రభుత్వ వార్. హై కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించిన ఏపి ప్రభుత్వం. నిమ్మగడ్డ రమేష్ కేసులో మరో కీలక మలుపు. సుప్రీంకోర్టు లో ఎస్ ఎల్ పి దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పరిశీలనలో ఏపీ ప్రభుత్వ ఎస్ ఎల్ పి. ఇప్పటికే కెవియట్ పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత మస్తాన్ వలి. మస్తాన్ వలి తరపు న్యాయవాడులకి సమాచారం ఇచ్చిన సుప్రీంకోర్టు.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.

షాకింగ్.. సీఎం ఇంటి సమీపంలో టీస్టాల్‌ నడిపే వ్యక్తికి పాజిటివ్..!

Tea stall owner near Uddhav's house 'Matoshree' tests positive for Covid-19, షాకింగ్.. సీఎం ఇంటి సమీపంలో టీస్టాల్‌ నడిపే వ్యక్తికి పాజిటివ్..!

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అంతా ఇంతా వణికించట్లేదు. చిన్న దేశాలను మొదలు కొని.. అగ్రదేశాలన్నింటిని ఈ వైరస్ గజగజ వణికిస్తోంది. అంతేకాదు.. ఈ మహమ్మారి ఎవర్నీ కూడా వదలట్లేదు. దీనికి కులం, మతం, భాష, దేశం అంటూ ఏమీ లేవు. అందరూ దీనికి సమానమే. మన ఇండియాలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలను ఈ మహమ్మారి చుట్టేసింది.

ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా ఎక్కువే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే నివాసానికి సమీపంలో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడం ఇప్పడు మరింత టెన్షన్ రేపుతోంది. మాతోశ్రీ సమీపంలోని ఓ టీ స్టాల్‌ యజమానికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అక్కడి ఓ అధికారి తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతమంతా ముందస్తు జాగ్రత్తలో భాగంగా శానిటైజేషన్ చేశారు. అంతే కాదు.. సదరు బాధితుడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు.

Tea stall owner near Uddhav's house 'Matoshree' tests positive for Covid-19, షాకింగ్.. సీఎం ఇంటి సమీపంలో టీస్టాల్‌ నడిపే వ్యక్తికి పాజిటివ్..!

కాగా.. రాష్ట్నంలో సోమవారం మరో 120 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 868కి పెరిగినట్టు వైద్యాధికారులు తెలిపారు.

Related Tags