Breaking News
  • పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. వాహనదారుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు. నదిలోకి దూకి యువతిని కాపాడిన ఏఎస్సై మాణిక్యాలరావు. మాణిక్యాలరావును అభినందించిన పోలీసులు, స్థానికులు.
  • చెన్నై: సినీ నటుడు రాఘవ లారెన్స్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. డబ్బు కోసమో, పబ్లిసిటీ కోసమో రజినీ రాజకీయాలకు వస్తున్నారని.. కొందరు మాట్లాడటం దురదృష్టకరం-రాఘవ లారెన్స్‌. రజినీకి రాజకీయాలు తెలియదు అనడం హాస్యాస్పదం. రజినీని ఎవరు టార్గెట్‌ చేసినా వాళ్లకు గట్టిగా సమాధానం చెప్తా. త్వరలో రజినీ రాజకీయం ఏంటో అందరూ చూస్తారు-రాఘవ లారెన్స్‌. రజినీ మీద అభిమానంతో కమలహాసన్‌ పోస్టర్లను పేడతో కొట్టి చించేవాణ్ణి. వాళ్లిద్దరు కలవడం ద్వారా తమిళనాడులో మంచి రోజులు రాబోతున్నాయి -సినీ నటుడు రాఘవ లారెన్స్‌.
  • కరీంనగర్‌: కోరుట్లలో వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన. ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల రాజేందర్‌. వైద్యంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతుంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి అంటే ప్రజలు భయపడేవారు. కేంద్ర పథకం ఆయుష్మాన్‌ పథకం కన్నా ఆరోగ్యశ్రీ మిన్న.
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.

ఇసుక కోసం.. బీజేపీ మద్దతు కోరిన టీడీపీ..!

TDP seeks BJP support over sand scarcity issue in AP, ఇసుక కోసం.. బీజేపీ మద్దతు కోరిన టీడీపీ..!

గత కొన్ని రోజులుగా.. ఏపీలో ఇసుక కొరతపై రచ్చ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనానికి అందని ఇసుక- రాజకీయ తుఫాన్‌గా మారింది. ఒకవైపు లాంగ్‌మార్చ్‌లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండయాత్ర చేస్తున్నాయి. ఇసుక కొరత విషయంలో.. ప్రభుత్వంపై.. విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అయితే.. తాజాగా.. ఇసుక కొరతపై.. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 14న దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటుగా.. బీజేపీని మద్దతు కోరింది టీడీపీ.

కార్మికులకు అండగా నిలిచేందుకు చంద్రబాబు దీక్ష చేస్తున్నారని.. ఈ దీక్షకు తమ మద్దతు కావాలని.. కన్నాను కోరారు ఆలపాటి. గుంటూరులోని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి.. టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వయంగా వెళ్లి.. మరీ  మద్దతు కోరారు. దీనికి.. కన్నా లక్ష్మీ నారాయణ కూడా సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేసినా.. వారికి.. తమ పార్టీ మద్దతు తప్పక ఉంటుందని కన్నా స్పష్టం చేశారు. ఏపీలో ఇసుక కొరత గురించి.. మొదటి నుంచీ బీజేపీ కూడా పోరాడుతూనే ఉంది.