‘హరికృష్ణ’పై ఎంపీ రామ్మోహన్ భావోద్వేగ ట్వీట్

దివంగత నేత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భావోద్వేగ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ఆయన్ని, ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘ఒక తండ్రిగానైనా, తెలుగు దేశం నేతగానైనా, వెండి తెర హీరోగానైనా హరికృష్ణగారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు దేశం పార్టీకి ఆయన అందించిన సేవల వలన పార్టీ ఎంతో ఎదిగింది. తండ్రి తగ్గ తనయుడిగా, తండ్రికి రథసారథిగా, పార్టీకి జనానికి మధ్య వారధిగా నిలిచిన హరికృష్ణగారికి నా జోహార్లు’ […]

'హరికృష్ణ'పై ఎంపీ రామ్మోహన్ భావోద్వేగ ట్వీట్
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 3:37 PM

దివంగత నేత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భావోద్వేగ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ఆయన్ని, ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘ఒక తండ్రిగానైనా, తెలుగు దేశం నేతగానైనా, వెండి తెర హీరోగానైనా హరికృష్ణగారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు దేశం పార్టీకి ఆయన అందించిన సేవల వలన పార్టీ ఎంతో ఎదిగింది. తండ్రి తగ్గ తనయుడిగా, తండ్రికి రథసారథిగా, పార్టీకి జనానికి మధ్య వారధిగా నిలిచిన హరికృష్ణగారికి నా జోహార్లు’ అంటూ.. ఉద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.

హరికృష్ణ.. సెప్టెంబర్ 2, 1956న నిమ్మకూరులో జన్మించారు. ఈయన ఎన్టీఆర్, బసవతారకంలకు నాలుగో సంతానం. పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు. అన్నగారి రథసారథిని ఆయనే దగ్గరుండి నడిపించారు. కష్టసుఖాల్లో వెన్నుదన్నుగా ఉండేవారు. చిన్నతనంలోనే హరికృష్ణ సినిమాలోకి తెరంగేట్రం చేశారు. తెలుగు భాష గురించి.. పార్లమెంటులో.. ఎంతో ధైర్యంగా తన వాణిని వినిపించిన గొప్ప నేతగా పలు ప్రశంసలు అందుకున్నారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత.. సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ.. ఆయన దూరంగా ఉన్నారు. 2018లో నల్గొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్‌ జరిగి హరికృష్ణ మృతి చెందారు. ఆయన మరణం.. నందమూరి అభిమానులను చాలా నిరాశ పరిచింది.