టిక్ టాక్‌ని బ్యాన్ చేయండి..పార్లమెంట్‌లో గల్లా జయదేవ్

ప్రస్తుతం టిక్..టాక్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఎన్ని అనర్థాలు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఈ యాప్‌ను యూజ్ చేస్తున్నారు. దీనిని వెంటనే నిషేదించాలని పెద్ద ఎత్తున అప్పీల్లు వచ్చాయి. కొంతమంది అయితే కోర్టు వరకు వెళ్లారు. అయితే తాజాగా దీనిపై టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించారు. వెంటనే టిక్ టాక్ తో పాటు సంబంధిత యాప్స్‌ను నిషేదించాలని కోరారు. దాదాపు 300 మిలయన్ ఇండియన్ […]

టిక్ టాక్‌ని బ్యాన్ చేయండి..పార్లమెంట్‌లో గల్లా జయదేవ్
Follow us

|

Updated on: Jul 03, 2019 | 8:08 PM

ప్రస్తుతం టిక్..టాక్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఎన్ని అనర్థాలు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఈ యాప్‌ను యూజ్ చేస్తున్నారు. దీనిని వెంటనే నిషేదించాలని పెద్ద ఎత్తున అప్పీల్లు వచ్చాయి. కొంతమంది అయితే కోర్టు వరకు వెళ్లారు. అయితే తాజాగా దీనిపై టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించారు.

వెంటనే టిక్ టాక్ తో పాటు సంబంధిత యాప్స్‌ను నిషేదించాలని కోరారు. దాదాపు 300 మిలయన్ ఇండియన్ యూజర్లు ఇండియాలో ఈ యాప్‌కు ఆకర్షితులయ్యారని చెప్పారు. టిక్ టాక్ యాక్సిస్ అవ్వాలంటే సదరు వ్యక్తికి సంబంధించిన 45 శాతం వివరాలను ఇవ్వాలని..దానివల్ల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అంతేకాక తప్పుడు వార్తలను సర్కిలేట్ చేసేందుకు కూడా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారని..గత ఎన్నికల్లో ఈ యాప్ ద్వారా పలు పార్టీలు విష ప్రచారాన్ని నిర్వహించాయని గల్లా జయదేవ్ ఆరోపించారు.