విజయసాయితో సీఎం. రమేష్ ముచ్చట్లు..! ఏంటా కహానీ..?

Vijaya Sai Reddy, విజయసాయితో సీఎం. రమేష్ ముచ్చట్లు..! ఏంటా కహానీ..?

రెండో రోజు లోక్‌సభలో సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తిర సన్నివేశం ఒకటి కనిపించింది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ పక్కపక్కనే కూర్చొని మంతనాలు జరపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముందు ఒకరినొకరు పలకరించుకొని, సీఎం రమేష్ ముందు వరుసలో, విజయసాయి వెనుక వరుసలో కూర్చొన్నారు. కాగా.. సంభాషణల నేపథ్యంలోనే విజయసాయి వెనుక నుంచి ముందుకు వచ్చి సీఎం రమేష్ పక్కన కూర్చొన్నారు. వారిద్దరూ దాదాపు చాలా సమయం మాట్లాడుతూ చర్చల్లో మునిగిపోయారు. మీ ఇద్దరి మధ్య ఆ చర్చలేంటని విజయసాయిని మీడియా అడుగగా.. ‘మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమంటూ అడిగానని’ సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *