ఫలితాల తర్వాత నేషనల్ పాలిటిక్స్‌లో బాబు ‘కీ’ రోల్- వైవీబీ

విజయవాడ: ఈ నెల 23 తర్వాత దేశ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించబోతున్నారని  ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ఓటమి భయంతోనే చంద్రబాబుని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోయిన ఆటగాడే రిఫరీని తప్పుపడతాడంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు వ్యవస్థలపై పోరాడుతున్నారు తప్ప వ్యక్తులపై కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్లు తీసుకువచ్చిన ఎన్నికల సంఘం.. వాటిలో స్లిప్పులను లెక్కించడానికి ఎందుకు సంశయిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఓవైపు ప్రజలు తాగు, సాగునీటి కోసం అల్లాడుతుంటే లోటస్ పాండ్‌లో కూర్చుని సేదతీరుతున్నారని, ప్రజా సమస్యలు జగన్‌కు పట్టవనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైవీబీ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *