ఏపీ ప్రభుత్వంపై బుద్ధా అసహనం

, ఏపీ ప్రభుత్వంపై బుద్ధా అసహనం

ఏపీలో ఇప్పటికే పలువురు మాజీలకు భద్రతను తగ్గించిన జగన్ సర్కారు.. ప్రజా ప్రతినిధుల విషయంలోనూ సమీక్షలు నిర్వహిస్తూ.. పలువురి భద్రతను కుదిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఉన్న 2+2 భద్రతను 1+1కు కుదించింది. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన వెంకన్న.. మిగిలిన ఇద్దరూ కూడా తనకు వద్దని, వారిని కూడా వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే గన్‌మెన్‌ల ఉపసంహరణ తమ చేతుల్లో లేదని స్థానిక పోలీస్ అధికారులు అంటున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పడిన కమిటీ సూచనల మేరకే భద్రత ఖరారవుతుందని వారు అంటున్నారు. కాగా.. విజయవాడలో నివాసం ఉండే ప్రజా ప్రతినిధులు, మంత్రులకు మాత్రమే సిటీ సెక్యూరిటీ వింగ్ నుంచి గన్‌మెన్‌లను కేటాయిస్తారు. జిల్లాలోని మిగతా ప్రజాప్రతినిధులకు ఆర్ముడ్ రిజర్వ్ విభాగం నుంచి గన్‌మెన్‌లను కేటాయిస్తుంటారు. అయితే ఇటీవల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత రాయపాటికి ఏపీ ప్రభుత్వం భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *