2018 నాటి కేసులో ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పటివరకూ ఏపీ పోలీసులు నిద్రపోతున్నారా? : బిటెక్ రవి

ఎమ్మెల్సీగా ఉన్న తనను అంతర్జాతీయ నేరస్థుడిలా వెంటపడి పట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. "స్టేషన్ కు రమ్మంటే వస్తా...

2018 నాటి కేసులో ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పటివరకూ ఏపీ పోలీసులు నిద్రపోతున్నారా? : బిటెక్ రవి
Follow us

|

Updated on: Jan 03, 2021 | 5:32 PM

ఎమ్మెల్సీగా ఉన్న తనను అంతర్జాతీయ నేరస్థుడిలా వెంటపడి పట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. “స్టేషన్ కు రమ్మంటే వస్తా.. దేశం విడిచి పారిపోతున్నట్లుగా వెంబడించి పట్టుకోవడం భావ్యం కాదు. అన్నం తినడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. వంగలపూడి అనిత ఎస్సీ అయితే ఆమెపైనా ఎస్సీ కేసు నమోదు చేయడం వింతగా ఉంది. ఈ ఘటన జరిగి రెండేళ్లయింది. అప్పటి నుంచి ఈ కేసు గోప్యంగా ఉంచారు. అరెస్టులు మాకు కొత్త కాదు. మేం ఇలాంటి కేసులకు భయపడేదిలేదు. పార్టీ కోసం మేం జైలుకు పోవడానికైనా సిద్ధమే.” అని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్ సందర్భాన జూమ్ యాప్ ద్వారా చెప్పుకొచ్చారు.

2018 కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్న రవి.. ఈ కేసులకు మేము భయపడం.. 2018 నుండి ఏపీ పోలీసులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. దళిత మహిళకు మద్దతు ఇస్తే తనపై కేసు పెట్టారని రవి చెప్పుకొచ్చారు. కాగా, ఆదివారం చెన్నై ఎయిర్పోర్ట్ నుండి బిటెక్ రవిని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.