Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

వైసీపీ ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే.. పార్టీ మారనున్నారా..!

MP Magunta Srinivasulu Reddy birthday Celebrations, వైసీపీ ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే.. పార్టీ మారనున్నారా..!

ఏపీలోని ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార వైసీపీకి చెందిన ఎంపీ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన వారసుడిని కూడా వెంట బెట్టుకొని వెళ్లిన ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎంపీపై ప్రశంసలు కురిపించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన బర్త్ డే కార్యక్రమానికి మంత్రి బాలినేనితో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఇక ఇదే వేడుకలకు చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్‌తో హాజరయ్యారు. శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించే వరకు అక్కడే ఉన్నారు. అంతేకాదు ఎంపీ గురించి నాలుగు మంచి మాటలు చెబుతూ ప్రసంగించారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. కరణం టీడీపీని వీడి.. వైసీపీలో చేరబోతున్నాడా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వేడుకలకు బలరాం వెళ్లడం వెళ్లడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు మాగుంట టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారని.. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారని.. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ వేడుకలకు హాజరయ్యారని చెబుతున్నారు. అంతేకాదు కరణం ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారరని ఆయన సన్నిహితులు కుండ బద్దలుగొడుతున్నారు.

Related Tags